త్రివిక్రమ్-ఎన్టీఆర్-భాషా

త్రివిక్రమ్ మంచి రచయిత.. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మంచి మాటల రచయిత. అంతే కానీ కథా రచయిత కాదు. ఆయన కథలు అన్నీ అంతంతమాత్రం కథలే. పైగా ఎత్తుకువచ్చినవే ఎక్కువ అని విమర్శలు…

త్రివిక్రమ్ మంచి రచయిత.. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మంచి మాటల రచయిత. అంతే కానీ కథా రచయిత కాదు. ఆయన కథలు అన్నీ అంతంతమాత్రం కథలే. పైగా ఎత్తుకువచ్చినవే ఎక్కువ అని విమర్శలు వున్నాయి. ఆ మధ్య వచ్చిన అజ్ఞాతవాసి కానీ, ఈ మధ్య వచ్చిన ఛల్ మోహన్ రంగా కానీ త్రివిక్రమ్ కథల స్థాయిని చెప్పకనే చెప్పాయి.

అలాంటి త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. మరి దానికి ఎలాంటి కథ అందిస్తున్నారో అన్నది అభిమానుల టెన్షన్. దీనిపై వినిపిస్తున్న సంగతులు చూస్తుంటే ఈ కథ కూడా కాస్త రొటీన్ నే అని తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభం అంతా అర్బన్ బేస్డ్ లవ్ స్టోరీగా వుంటుంది. అలాంటిది వున్నట్లుండి హీరోకి వున్న యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ బయటపడుతుంది. దాంతో సినిమా లవ్ స్టోరీ నుంచి యాక్షన్ మోడ్ లోకి వెళ్తుంది. మళ్లీ ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చాక, క్లయిమాక్స్ దిశగా నడుస్తుంది అన్నమాట.

వినిపిస్తున్న ఈ సంగతి నిజమే అయితే రజనీ భాషా దగ్గర నుంచి చాలా సినిమాలు కళ్ల ముందు మెదుల్తాయి. ఎటొచ్చీ త్రివిక్రమ్ స్టయిల్ టేకింగ్, త్రివిక్రమ్ స్టయిల్ మాటలు ప్లస్ పాయింట్ లు కదా? అవి బాగుంటే చాలు.