చందు సినిమా వరుణ్ తేజ తోనా?

బన్నీ తో సినిమా చేస్తాడు అనుకుంటే, వరుణ్ తేజతో ఫిక్సవుతున్నాడు చందు మొండేటి అంటూ వార్తలు గుప్పుమన్నాయి. చందు మొండేటి దగ్గర  ఓ మాంచి కిడ్నాప్ థ్రిల్లర్ డ్రామా సబ్జెక్ట్ వుంది. ఇది కొంచెం…

బన్నీ తో సినిమా చేస్తాడు అనుకుంటే, వరుణ్ తేజతో ఫిక్సవుతున్నాడు చందు మొండేటి అంటూ వార్తలు గుప్పుమన్నాయి. చందు మొండేటి దగ్గర  ఓ మాంచి కిడ్నాప్ థ్రిల్లర్ డ్రామా సబ్జెక్ట్ వుంది. ఇది కొంచెం మెడికల్ బ్యాక్ గ్రవుండ్ లో నడుస్తుంది. ఇది ఎప్పుడో మాటల మధ్య వరుణ్ తేజకు చెప్పాడు. 

అప్పటి నుంచి వరుణ్ తెగ సరదా పడిపోతున్నాడట ఆ సబ్జెక్ట్ చేయడానికి. కానీ చందు మాత్రం ముందు వెనుక ఆలోచిస్తున్నాడు. ప్రేమమ్ విడుదల అయ్యే వరకు ఎవరికీ కమిట్ కాకూడదనుకుంటున్నాడని వినికిడి. పైగా చందుకు ప్రేమమ్ తరువాత వెంటనే సెట్ మీదకు వెళ్లగలిగిన హీరో కావాలి. వరుణ్ ప్రస్తుతం రెండు సినిమాలు కమిట్ అయి వున్నాడు. 

వచ్చే సమ్మర్ కు కానీ ఫ్రీ కాడు. దాదాపు మిగిలిన హీరోలందరిదీ ఇదే పరిస్థితి. అందుకే ఏ విషయమూ డిసైడ్ చేసుకోలేకపోతున్నాడని వినికిడి. ప్రేమమ్ తరువాత బన్నీ దగ్గర నుంచి మరోసారి పిలుపు వస్తే మాత్రం ఈక్వేషన్లు అన్నీ మారిపోతాయి.