చాన్నాళ్లకు రాధిక కామెడీ

ఒకప్పటి హీరోయిన్, ఇప్పుడు టీవీ సీరియళ్లలో ఎక్కువగా, సినిమాల్లో కాస్త తక్కువగా కనిపించే నటి రాధిక. ఇప్పుడు సీరియస్ పాత్రల్లో కనిపిస్తున్నా, రాధికలో మాంచి కామెడీ టైమింగ్ వుంది. Advertisement ఆమె హీరోయిన్ గా…

ఒకప్పటి హీరోయిన్, ఇప్పుడు టీవీ సీరియళ్లలో ఎక్కువగా, సినిమాల్లో కాస్త తక్కువగా కనిపించే నటి రాధిక. ఇప్పుడు సీరియస్ పాత్రల్లో కనిపిస్తున్నా, రాధికలో మాంచి కామెడీ టైమింగ్ వుంది.

ఆమె హీరోయిన్ గా చేసిన చాలా సినిమాల్లో ఇది కనిపిస్తుంది. కానీ ఈ మధ్య ఆమె కామెడీ టైమింగ్ ను ఎలివేట్ చేసే సరైన పాత్ర రాలేదు. ఇప్పుడు ఆ లోటు తీరుస్తోందట రాజా ది గ్రేట్. 

రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో హీరో తల్లిగా రాధికకు మాంచి పాత్ర పడిందట. డైరక్టర్ అనిల్ రావిపూడి మాంచి కామెడీ కూడా అందిస్తాడని ఇప్పటికే అతగాడి సినిమాలు ప్రూవ్ చేసాయి.

రాజా ది గ్రేట్ లో రాధిక-శ్రీనివాసరెడ్డి కాంబినేషన్ లో ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ట్రాక్ రన్ చేసాడట. అది బాగా క్లిక్ అయిందని, ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. హీరో తల్లి పాత్రలో రాధిక, స్నేహితుడి పాత్రలో శ్రీనివాసరెడ్డి కనిపిస్తారట. వీళ్లిద్దరు కామెడీ టైమింగ్ తో మాంచి నవ్వులు పండించారని తెలుస్తోంది. 

రాధికనే కాదు, సరైన పాత్ర పడితే శ్రీనివాస రెడ్డి కూడా రెచ్చిపోతాడు. గతంలో అనిల్ రావిపూడి ఓసారి శ్రీనివాస రెడ్డిని ఫుల్ గా ఎలివేట్ చేసాడు. ఇప్పుడు మళ్లీ మరోసారి అలాంటి చాన్సిచ్చాడన్నమాట.