రాజుగారి గది-2: నో సాంగ్స్.. ఓన్లీ సస్పెన్స్

ఆఖరి నిమిషంలో రాజుగారి గది-2లో రెండు కీలక మార్పులు జరిగాయి. అది కూడా నాగార్జున సూచనతో చేసినవి. ఆ రెండు మార్పులు రాజుగారి గది-2ను సూపర్ హిట్ చేస్తాయని నమ్ముతోంది యూనిట్. వాటిలో మొదటిది…

ఆఖరి నిమిషంలో రాజుగారి గది-2లో రెండు కీలక మార్పులు జరిగాయి. అది కూడా నాగార్జున సూచనతో చేసినవి. ఆ రెండు మార్పులు రాజుగారి గది-2ను సూపర్ హిట్ చేస్తాయని నమ్ముతోంది యూనిట్. వాటిలో మొదటిది ఫస్ట్ పార్ట్ లో కామెడీ. ఈ సినిమాలో అనుకున్న స్థాయిలో కామెడీ పండలేదని తెలుస్తోంది. అలా ఎబ్బెట్టుగా అనిపించిన కామెడీ క్లిప్స్ అన్నింటినీ నిర్థాక్షిణ్యంగా తొలిగించాడట నాగార్జున. దీనివల్ల జరిగిన ఉపయోగం ఏంటంటే.. సినిమాలో నాగ్ ఎంట్రీ కాస్త ముందుకు జరిగింది.

ఇక రాజుగారి గది-2లో చేసిన మరో కీలక మార్పు పాటలు లేకుండా చేయడం. అవును.. ఈ సినిమాలో అనవసరంగా అనిపించే 2 సాంగ్స్ ను నాగ్ తొలిగించాడు. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్, షకలక శంకర్ పై వచ్చే ఓ సాంగ్.. సెకెండాఫ్ లో సమంతపై తీసిన మరో సాంగ్ మాత్రమే మూవీలో ఉన్నట్టు తెలుస్తోంది. సీరత్ కపూర్ పై తీసిన హాట్ సాంగ్ తో పాటు సెకెండాఫ్ లో మరో సాంగ్ ను నాగ్ సూచన మేరకు తీసేశారట.

తాజా మార్పులతో రాజుగారి గది-2 సినిమా చాలా క్రిస్పీగా, టైట్ స్క్రీన్ ప్లేతో వచ్చినట్టు చెబుతున్నారు. జస్ట్ 2 గంటల 7 నిమిషాల నిడివి మాత్రమే ఉంది. ఓపెనింగ్ తో పాటు రోలింగ్ టైటిల్స్ ను మినహాయిస్తే.. రాజుగారి గది-2 సినిమా డ్యూరేషన్ 2 గంటల లోపే. ఈ తక్కువ రన్ టైం సినిమాకు బాగా ప్లస్ అవుతుందని యూనిట్ భావిస్తోంది.