చానెళ్ల డిస్కషన్లకు మహేష్ నో ?

స్పైడర్ సినిమా విడుదల దగ్గరకు వచ్చేసింది. ఇంక జస్ట్ పది రోజులే సమయం వుంది. అయితే అదే సమయంలో హీరో మహేష్ బాబు తన కొత్త సినిమా భరత్ అనే నేను షూట్ లో…

స్పైడర్ సినిమా విడుదల దగ్గరకు వచ్చేసింది. ఇంక జస్ట్ పది రోజులే సమయం వుంది. అయితే అదే సమయంలో హీరో మహేష్ బాబు తన కొత్త సినిమా భరత్ అనే నేను షూట్ లో బిజీగా వున్నారు. ఆయన 22, 23, 24,25 తేదీల్లో మాత్రమే ఖాళీగా వుంటారు. అందువల్ల స్పైడర్ ప్రచారానికి మహేష్ కు డేట్ లు సరిపడాలేవు.

నిజానికి శ్రీమంతుడు తరువాత మహేష్ తన మైండ్ సెట్ మార్చుకున్నారు.  ప్రచారానికి వీలైనంత ఎక్కువ టైమ్ కేటాయిస్తా అని అప్పట్లో చెప్పారు. అయితే ఈసారి మాత్రం అలా కుదరడం లేదు. అందుకే చానెళ్లలో ముఖాముఖిలు, డిస్కషన్ షో లను స్కిప్ చేయాలని మహేష్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ప్రింట్, వెబ్ మీడియాలతో ముఖాముఖిలు జరిపినపుడు తీసిన విడియో క్లిప్స్ నే చానెళ్లకు కూడా ఇచ్చే అవకాశం వుంది. అవకాశం వుంటే చానెళ్లన్నింటితో కలిసి ఒకేసారి ఓ ముఖాముఖి నిర్వహించాలని కూడా ఆలోచిస్తున్నారట.

సాధారణంగా సినిమా ప్రచారం అంటే హీరోలు ఛానెళ్ల కు ఒకదాని వెంట ఒకదానికి తిరగడం లేదా, ఒకే దగ్గర సెట్ వేసి, వరుసగా అక్కడే వన్ బై వన్ ఇంటర్వూలు కానివ్వడం అన్నది ఆనవాయతీగా వస్తోంది. ఇందులో మొదటి పద్దతి వల్ల హీరో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కే చానెల్ దిగే చానెల్ అన్నట్లు తిరగాలి.

లేదా, ఒకే దగ్గర వరుసపెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పిందే చెప్పుకుంటూ రావాలి అందరికీ. అందుకే ఇది స్కిప్ చేసి, ముఖాముఖి కార్యక్రమం ప్రింట్, విజువల్, వెబ్ మీడియాలకు మూడు రోజుల పాటు కానిచ్చేయాలని మహేష్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.