చానెళ్ల పోరులో బలైపోయిన దర్శకుడు

పాపం..రేవన్ యాది..బూచోడు బూచెమ్మ దర్శకుడు. ఉగ్గబట్టుకుని వుండలేక మనసులో మాటలు కక్కేసాడు. దాంతో అతగాడిని తీసుకొచ్చి సాక్షి ఛానెల్ లో కూర్చోబెట్టారు. సినిమా టీవీ 9 వారి సన్నిహితులదన్న సంగతి తెలిసిందే. దాంతో సాక్షి…

పాపం..రేవన్ యాది..బూచోడు బూచెమ్మ దర్శకుడు. ఉగ్గబట్టుకుని వుండలేక మనసులో మాటలు కక్కేసాడు. దాంతో అతగాడిని తీసుకొచ్చి సాక్షి ఛానెల్ లో కూర్చోబెట్టారు. సినిమా టీవీ 9 వారి సన్నిహితులదన్న సంగతి తెలిసిందే. దాంతో సాక్షి వాళ్లు వీలయినంత మేటర్ పిండారు. దాంతో నిర్మాతలకు వళ్లు మండింది. తీసుకెళ్లి టీవీ 9 కూర్చోపెట్టి, రివర్స్ ర్యాగింగ్ చేసినట్లు పని కానిచ్చేసారు.

డైరక్టర్ ..పని చేసాడు..డబ్బులిచ్చాం..అక్కడితో పనైపోయింది..సినిమాతో ఇంకా నీకేం సంబంధం అన్నట్లు మాట్లాడారు. నిజానికి సినిమా ఫ్లాప్ అయి వుంటే ఇలాగే అనేవారా..సినిమా విడుదలకు ముందు వరకు దర్శకుడు వీరభద్రమ్ సూపర్ అని భాయ్ సినిమా సమయంలో అని, తీరా ఫ్లాప్ అయ్యాక, అంత రాంగ్ స్టెప్ తన జీవితంలో లేదన్న నాగార్జున మాదిరిగా ఇక్కడా దర్శకుడి ఇజ్జత్ తీయకుండా వుండేవారా? సపోజ్ వారు ప్రచారానికి రమ్మని దర్శకుడు రాకుంటే ఊరుకునేవారా? ఏం చేయగలడు..చిన్న దర్శకుడు..కొత్తవాడు. బలైపోయాడు అంతే.