చరణ్ – శ్రీను వైట్ల సినిమా విదేశాల షూటింగ్ ముగించి ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి పది నిమషాల స్పెషల్ రోల్ వేస్తున్నారని గుసగుసలు వున్నాయి. అయితే ఆ సంగతేమో కానీ, చరణ్ బాబాయ్ నాగబాబు మాత్రం కచ్చితంగా వున్నారు. ఆయన సీన్లను ఈ రోజు నుంచి హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు.
నాగబాబుతో కృతి కర్బందా కాంబినేషన్ సీన్లు కూడా వుంటాయి. కృతి ఎల్లుండి నుంచి షూటింగ్ లో పాల్గొంటుంది. ఈ సినిమా టైటిల్ గురించి మాత్రం ఇంకా కిందా మీదా పడుతున్నారు. ప్రచారంలో వున్న టైటిళ్లలోంచి ఒకటి సెలెక్ట్ చేయడమా? లేక, ఇంకా పవర్ ఫుల్ టైటిల్ ఆలోచించడమా అని డిస్కషన్ నడుస్తోంది.
ఇదిలా వుంటే గత నెల 27 నుంచి బ్యాంకాక్ లో జరిగిన షూటింగ్ లో 'మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' నాయిక రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా బ్యాంకాక్ లో భారీ పతాక సన్నివేశాలను, భారీ వ్యయంతో చిత్రీకరించామని నిర్మాత డివివి దానయ్య తెలిపారు.
అలాగే టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. బ్యాంకాక్ లో చిత్రీకరించిన సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయన్నారు. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు.