‘మగధీర’ సినిమాకి బడ్జెట్ ఎక్కువైపోయింది.. సినిమా నిర్మాణం ఆలస్యమయ్యింది.. దాంతో విడుదలకు ముందు సినిమాపై చాలా అనుమానాలు. విడుదలయ్యాక మాత్రం అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ‘రచ్చ’ సినిమా విషయంలోనూ ఇంతే. ‘నాయక్’ సంగతి సరే సరి. ‘ఎవడు’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
విడుదలకు ముందు ఆయా సినిమాలకు ఎంత నెగెటివ్ పబ్లిసిటీ జరిగినా, విడుదలయ్యాక మాత్రం సక్సెస్‌ఫుల్ చిత్రాలన్పించుకోవడం చరణ్‌కే చెల్లిందేమో. తాజాగా చరణ్ నటిస్తోన్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రానికీ నెగెటివ్ పబ్లిసిటీ ఎక్కువైపోయింది. సినిమాపై దర్శక నిర్మాతలకే పెద్దగా నమ్మకాల్లేవంటూ ప్రచారం జరుగుతోంది. చరణ్‌కి ఇదో సెంటిమెంట్.. సినిమా మాత్రం సూపర్ హిట్.. అని అభిమానులు అనుకుంటున్నారు.
అయితే ‘ఆరెంజ్’ విషయంలో మాత్రం ఈ నెగెటివ్ పబ్లిసిటీకి తగ్గట్టే సినిమా అటకెక్కిపోయిందనుకోండి.. అది వేరే విషయం. మరి, ‘గోవిందుడు అందరివాడేలే’ చరణ్ నెగెటివ్ పబ్లిసిటీ సెంటిమెంట్‌ని రిపీట్ చేసి హిట్ కొడ్తుందా.? వేచి చూడాల్సిందే.