సమంతకు కోన ఫ్యామిలీకి వున్న స్నేహానుబంధం అందరికీ తెలిసిందే. తరచు సమంత ట్విట్టర్ లో నీరజ కోనతో తెగ ముచ్చట్లేసుకుంటుంది. ఆ పరిచయం, చనువుతోనే కోన వెంకట్ తన సినిమా గీతాంజలిలో స్పెషల్ సాంగ్ కు అడిగాడని వినికిడి.
అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఇది. అంతా బాగానే వుంది. సమంత ఓకె అంది అని వార్తలు వినవచ్చాయి. కానీ తీరా అంతా అయి షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి, పాట స్టయిల్, కాస్ట్యూమ్స్ చూసి సమంత నో అందని ఇప్పుడు వార్తలు గుప్పు మంటున్నాయి. ఒ
కసారి డిసైడ్ అయితే తన మాట తనే వినదేమో? కోన ఇప్పుడు ఆల్టర్నేటివ్ కోసం కిందా మీదా పడుతున్నాడని వినికిడి. అసలు మొహమాటానికి ఊ అని..చివరి నిషయంలొ ఇలా ట్విస్ట్ ఇచ్చిందని మరో టాక్. అదే నిజమైతే సమంతా చాలా గడుసు అనే అనుకోవాలి.