రామ్‌గోపాల్‌వర్మ ఐస్‌క్రీమ్ ఈ వారమే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఎన్ని లక్షల్లో తీసాడో తెలీదు కానీ ఈ చిత్రానికి టేబుల్ ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పుకుంటున్నారు. వర్మ సినిమాకి టేబుల్ ప్రాఫిట్ అంటే అది చాలా పెద్ద విశేషమే అనుకోవాలి. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎంత స్పందన వస్తుందనేది చూడాలి.
అసలే దీనిని దృశ్యంతో పోటీగా రిలీజ్ చేస్తున్నారు. ముందు అయితే దృశ్యంతో పాటే ఈ చిత్రమూ అదే రోజున విడుదలవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఒక రోజు లేట్‌గా అంటే.. ఈ శనివారం ఐస్‌క్రీమ్ రిలీజ్ అవుతుంది. ఒక్క రోజు గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ సినిమా ఏమాత్రం పర్‌ఫార్మ్ చేయగలదో ఏమో మరి.
అసలే వర్మ సినిమాలంటే ఆడియన్స్ చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారీమధ్య. ఎప్పటిలానే తన మార్కు విన్యాసాలు చేస్తూ పబ్లిసిటీ కోసం చూస్తోన్న వర్మ జిత్తులు ఎంతవరకు పారతాయో. దృశ్యంని తట్టుకుని ఈ ఐస్‌క్రీమ్ థియేటర్లలో కొద్ది రోజులు నిలుస్తుందో లేక విడుదలైన మర్నాడే అదృశ్యం అవుతుందో?