సినిమా విడుదల సమయంలో మీడియాకు చూపించడం అన్నది ఓ పద్దతి. ఎప్పుడో కానీ ఓ రోజు ముందు చూపించరు. అలాంటిది ఇప్పడు 'దృశ్యం' సినిమాను ఏకంగా రెండు రోజుల ముందే మీడియాకు చూపించేస్తున్నారు. బుధవారం సాయంత్రమే మీడియాకు షో ఎరేంజ్ చేసారు. ఇదంతా సినిమాపై కాన్పిడెన్సేనా అన్నది అనుమానం.
ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చి, నెగిటివ్ రివ్యూలు వచ్చిన సీను సితారైపోతుంది. అయితే ఈ సంగతి తెలిసీ చూపిస్తున్నారంటే సినిమా మీద పిచ్చ కాన్ఫిడెన్స్ వుండి వుండాలని టాక్. అయితే అదే సమయంలో మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోల సినిమాలకు అంతగా ఓపెనింగ్స్ వుండడం లేదు.
వెంకటేష్ మసాలా సినిమా పరిస్థితి కూడా అదే. దృశ్యం బాగానే వచ్చింది కానీ ఓపెనింగ్స్ వుంటాయా అన్నది అనుమానం.
అందుకే ఎలాగూ బాగా వచ్చింది కాబట్టి, ముందుగా మీడియాకు షో వేసేస్తే, పాజిటివ్ రివ్యూలు వస్తే, అది ఓపెనింగ్స్ కు పనికి వస్తుందని ఈ ప్లాన్ అన్నది ఆ రెండో టాక్. చూడాలి ఈ ముందస్తు ప్రదర్ళన ఏ మేరకు దృశ్యానికి ఉపయోగపడుతుందో?