వినాయక్ కు టెన్షన్..టెన్షన్

దర్శకుడు వివి వినాయక్ కు రెండు టెన్షన్లు పట్టి పీడిస్తున్నాయట. ఒకటి అంచనాలకు మించిన ఖర్చుతో నిర్మించిన అల్లుడు శీను. అది పెద్ద సవాల్. దీని ఫలితం ఎలా వుంటుందా అని కిందా మీదా…

దర్శకుడు వివి వినాయక్ కు రెండు టెన్షన్లు పట్టి పీడిస్తున్నాయట. ఒకటి అంచనాలకు మించిన ఖర్చుతో నిర్మించిన అల్లుడు శీను. అది పెద్ద సవాల్. దీని ఫలితం ఎలా వుంటుందా అని కిందా మీదా పడుతున్నాడట. బెల్లంకొండ సురేష్ తనపైనే మొత్తం భారం పెట్టి, కావాల్సిన వనరులు, సమంత, తమన్నా లాంటి నటులను తెచ్చి మరీ సహకరించాడు. ఇంక ఫలితం రివర్స్ అయితే దాని ప్రభావం తనపైనే వుంటుందన్నది ఒక ఆందోళన. 

మరోపక్క మెగాస్టార్ ప్రెస్టీజియస్ మూవీకి తననే డైరక్టర్ అని మాట ఇచ్చారు కానీ చిన్న ట్విస్ట్ వుందని వినికిడి. ఆగస్టు 22 లోగా ఏ రచయిత కథ తెచ్చినా, అది నచ్చినా వినాయక్ మాత్రమే డైరెక్ట్ చేస్తాడు. కానీ ఒక వేళ వేరే దర్శకుడు ఎవరైనా చిరుకు నచ్చే కథ తెచ్చిన పక్షంలో మాత్రం చాన్స్ ఆ డైరక్టర్ కు వెళ్లిపోతుంది. చాలా మంది డైరక్టర్ లు ఈ పనిలో బిజీగా వున్నారు. 

అందుకే ఇప్పుడు ఆ చాన్స్ వదులుకోకుండా వుండడం కోసం వినాయక్, తన రచయిత ఆకుల శివ కలిసి ఎలాగైనా చిరుకు నచ్చే కథ వండాలని కిందా మీదా పడుతున్నారట. రెండు టెన్షన్లు ఒకేసారి. పాపం కష్టమే మరి.