ముమైత్ ఖాన్, అల్ఫాన్సాలాంటి ఐటెమ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌లని, లేదా వెటరన్స్ అయిపోయిన హీరోయిన్లని పెట్టి ఐటెమ్ సాంగ్స్ తీయడం మనకి మామూలే. క్రేజీ హీరోయిన్లతో ఐటెమ్ సాంగ్స్ చేయించుకోవడం బాలీవుడ్ ఇస్టయిల్. ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే స్టయిల్లో స్టార్ హీరోయిన్స్‌తో ఐటెమ్ సాంగ్స్ చేయిస్తోంది.
స్టార్ హీరోయిన్లతో ఐటెమ్ సాంగ్ చేయించుకోవడం అంటే మాటలు కాదుగా? వారికి భారీగా పారితోషికం ఇచ్చుకోవాలి. ఎంత ఇచ్చినా కానీ ఆ పాట చేయడానికి వారికి మనసు పుట్టాలి. ఎన్నో కలిసి వస్తే కానీ ఒక స్టార్ హీరోయిన్‌తో ఐటెమ్ సాంగ్ చేయించడం ఇంపాజిబుల్. అలాంటిది ఇప్పుడు వరుసపెట్టి ఇలాంటి కాస్ట్‌లీ ఐటెమ్స్ చాలా రెడీ అవుతున్నాయ్.
అల్లుడు శీను చిత్రంలో తమన్నా ఐటెమ్ సాంగ్ చేస్తే, ఆగడులో శృతిహాసన్ ఐటెమ్ సాంగ్‌కి డాన్స్ చేయనుంది. కాజల్ కూడా గీతాంజలి చిత్రంలో ఐటెమ్ సాంగ్ చేయడానికి అంగీకరించిందని వార్తలొస్తున్నాయి. వీరితో సాంగ్ చేయించుకోవడం వల్ల నిర్మాతకి నలభై, యాభై లక్షలు అదనంగా ఖర్చవుతాయి. ఈ పాటల వల్ల సదరు సినిమాలకి ఎంత బెనిఫిట్ ఉంటుందో ఏమో మరి.