దర్శకుడు పూరి జగన్నాధ్ వ్యవహార శైలి నిత్యం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగానే వుంటోంది. ఆగస్టులో మెగా స్టార్ 150 వ సినిమా క్లాప్ పెట్టుకుని, ఇప్పుడు వున్నట్లుండి..వరుణ్ తేజ సినిమా ప్రకటించడమేమిటి? అది కూడా సెప్టెంబర్ దాకా షెడ్యూలు, అక్టోబర్ వరకు పోస్టు ప్రొడక్షన్ పెట్టుకోవడం ఏమిటి? అంటే దర్శకుడు వినాయక్ కూడా మెగాస్టార్ సినిమా రేస్ లో వున్నది నిజమేనా?
ఇప్పడు ఈ విషయమై తండ్రి మెగాస్టార్ సినిమాను నిర్మించాలనుకుంటున్న చరణ్ కు కాస్త ముందు వెనుక ఆలోచించుకోమని సలహాలు వస్తున్నాయట. అందునా ఇద్దరు సన్నిహితులు ఆ సలహా ఇచ్చారన్నది టాక్. అందులో ఒకరు బాబాయ్ పవన్ కళ్యాణ్. ఆయన కళ్యాణ్ తో, 'ఏం జరుగుతోంది..ఆ సినిమా ముందు పెట్టుకుని, ఈ సినిమా ప్రకటించడం ఏమిటి? అసలు ఏమిటిదంతా..' అని ప్రశ్నించినట్లు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.
అదే సమయంలో ఇటీవల చరణ్ కు మాంచి దోస్త్ గా మారిన హీరో నితిన్ కూడా పూరి విషయంలో ముందు వెనుక ఆలోచించుకోమని సలహా ఇచ్చాడని మరో వార్త చక్కర్లు కొడుతోంది. మరి చరణ్ ఆలోచిస్తాడో, మెగాస్టార్ డెసిషన్ మార్చుకుంటాడో? వేచి చూస్తే కానీ తెలియదు.