ఆర్ఆర్ఆర్ పై వస్తున్నన్ని గ్యాసిప్ లు మరి దేనిమీదా రావడంలేదు. కానీ ఒక్కటీ నిజంకాని గ్యాసిప్ లే. బిఫోర్ ఇండిపెండెన్స్, 2020 రెండు కాలాలు సినిమాలో వుంటాయని, హీరోయిన్లు ఫిక్స్ అయిపోయారని మరోటి, ఒకరు దొంగ ఇంకొకరు పోలీస్ ఇలా చాలా వున్నాయి. వాస్తవానికి సినిమాలో రామ్ చరణ్ ది పోలీస్ అధికారి పాత్రే కానీ, ఎన్టీఆర్ దొంగ టైపు పాత్ర కాదు. చరణ్ తో సమానమైన స్టామినా వున్న పాత్రే.
అలాగే సినిమా మొత్తం బిఫోర్ ఇండిపెండెన్స్ పీరియాడికల్ డ్రామాగానే వుంటుంది. ఇక హీరోయిన్ల విషయంలో కొంత క్లారిటీ వుంది. ఆలియా భట్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆమె సినిమాలో చరణ్ పక్కన కనిపిస్తుంది. ఎన్టీఆర్ సరసన నటించడానికి హాలీవుడ్ నటిని వెదుకుతున్నారు. ఎందుకంటే కథ ప్రకారం ఎన్టీఆర్ సరసన వుండే అమ్మాయి విదేశీ వనితగా కనిపిస్తుంది.
ఆలియా భట్ వ్యవహారం ఈవారంలో ఫైనల్ కావచ్చు. ఫారిన్ అమ్మాయిగా ఎవరు అన్నది ఇంకా తేలలేదు. వెదుకులాట సాగుతోంది.