Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చరణ్ ఓకె..ఎన్టీఆర్ ఎప్పుడు?

చరణ్ ఓకె..ఎన్టీఆర్ ఎప్పుడు?

ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి బయటపడి రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నారు. ఇంకో సినిమాకు శ్రీకారం చుడుతున్నారు. ఆచార్య సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. 

శంకర్ డైరక్షన్ లో మరో సినిమాకు క్లాప్ కొట్టబోతున్నారు. కానీ అదే ఆర్ఆర్ఆర్ లో లాక్ అయిన ఎన్టీఆర్ మాత్రం తరువాత సినిమా కు ఇంకా స్విచాన్ చేయలేకపోతున్నారు.

ఎన్టీఆర్ తరువాత సినిమా ఫిక్స్ అయితే అయింది. కొరటాల శివ డైరక్షన్ లో. కానీ అది ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో తెలియని పరిస్థితి. ఆచార్య సినిమా పూర్తి కావాలి. అది నవంబర్ లోనో, ఆ తరువాతో విడుదల కావాలి. అప్పుడు ఎన్టీఆర్ సినిమా. ఈలోగా ఎన్టీఆర్ ఖాళీగా ఏమీ లేరు. 

మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం చేస్తున్నారు. కానీ సినిమా అన్నదే అభిమానులు ఎదురు చూసేది.  కానీ అది ఎప్పుడన్నదే తెలియదు.

పైగా ఆర్ఆర్ఆర్ తరువాత ఆ వెంటనే చరణ్ మరో పాన్ ఇండియా సినిమాను పట్టుకోగలిగాడు. కానీ ఎన్టీఆర్ అటు దృష్టి పెట్టలేదు. 

కొరటాల శివ సినిమా ఎంత ఫాస్ట్ గా తయారు చేసినా, 2023 సెకండాఫ్ లో కానీ థియేటర్లలోకి రావడం కష్టం. ఈ  లోగా చరణ్ ఓ సినిమా అందించడం, మరో సినిమా ఫినిష్ చేసే స్టేజ్ లోకి వెళ్లడం అంటే ప్లానింగ్ బాగుంది అనుకోవాలేమో? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?