వెనకటికి ఎవరిమీదో అలిగి ఏదో చేసాడట. అలాగ్గా వుంది రామ్ చరణ్-బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ వ్యవహారం. ఈ ఫస్ట్ లుక్ వివరాలు ముందుగా మీడియాలో లీక్ అయిపోయాయి. దేవుని పల్లకీ వస్తుంటే, ముందుగా రామ్ చరణ్ తెల్లటి లాల్చీ, పంచెకట్టులో వున్న స్టిల్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేయాలని రెడీ చేయించారు. ఆ వివరాలు కాస్తా బయటకు వచ్చేసరికి, కాదు, ఎలాగూ బయటకు వచ్చేసింది కాబట్టి, పైగా అది తమిళ వాసన కొడుతుందన్న చిన్న అనుమానం వుందని, దర్శకుడు బోయపాటి, లాస్ట్ మినిట్ లో హడావుడిగా మళ్లీ తనదైన మాస్ లుక్ ఒకటి రెడీ చేయించారు.
ఈ స్టిల్ మళ్లీ ఫక్తు బోయపాటి జయ జానకీనాయక మార్క్ లోనే వుంది. హీరో మారాడు అంతే. కానీ చరణ్ ఫేస్ సగమే కనిపించడం, ఓ కన్ను మూసేయడం, తీసిన యాంగిల్ లో బాడీ లాంగ్వేజ్ అంత బాగా లేకపోవడంతో, ఫ్యాన్స్ ఇంక పైకి ఏమీ మాట్లాడలేకపోతున్నారు.
కానీ ఆఫ్ ది రికార్డుగా, చరణ్ సినిమాను బోయపాటి ఏదో చేసేటట్టు వున్నారు అని కామెంట్ చేస్తున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో హడావుడిగా మార్చడం వల్ల ఈ స్టిల్ ఇలా అరకొరగా బయటకు వచ్చిందన్నది ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.
పైగా లోగో కూడా మూడు ముక్కలు చేసి, రామ అన్నది పెద్దగా పెట్టారు. అరవింద సమేత వీరరాఘవలో, వీర రాఘవ చిన్నది చేసి, అరవింద సమేత అన్నది పెద్దగా వున్నా బాగుంది. ఇప్పుడు జస్ట్ రామ అన్నదే పెద్దగా వుంచారు. అంటే ఇక సినిమా పేరు.. రామ.. రామ అనుకోవాల్సిందే అన్నమాట.
తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్