బన్నీ సినిమా ఎప్పుడు.. ఎవరితో.. అన్నది చిరకాలంగా అభిమానులకు సమాధానం దొరకని ప్రశ్న. ఈ మధ్యనే ఈ ప్రశ్నకు అనఫీషియల్ గా సమాధానం దొరికింది. త్రివిక్రమ్ డైరక్షన్ లో బన్నీ సినిమా అని. కానీ బ్యానర్, మిగతా వివరాలు ఖరారు కాలేదు.
కానీ అధికారిక ప్రకటన మాత్రం రేపు వస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు రేపు. ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ గీతాఆర్ట్స్ సంస్థ ప్రకటన ఇవ్వబోతోంది. అదే అధికారిక ప్రకటన.. బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు. బ్యానర్ డిసైడ్ అయిన తరువాత మళ్లీ పూర్తి వివరాలతో ప్రకటిస్తారు.
బన్నీ, ఆయన సన్నిహితుడు బన్నీ వాస్ కలిపి, ఈ సినిమాను ఎలాగైనా గీతాఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించాలని అనుకుంటున్నారు. కానీ దర్శకుడు త్రివిక్రమ్ నే నమ్ముకుని వున్న సంస్థ హారిక హాసిని. మరే డైరక్టర్ కు ఆ సంస్థ అడ్వాన్స్ ఇవ్వలేదు. సంబంధం పెట్టుకోలేదు. మరి అలాంటి సంస్థను ఎలా కాదంటాడు త్రివిక్రమ్?
ఇదీ సమస్య. పైగా హారిక హాసిని చినబాబు అంటే అల్లు అరవింద్ కు ప్రత్యేక అభిమానం. ఆయన ఈ విషయంలో కలుగచేసుకోలేరు. అందుకే ఈ టస్సెల్ తెగకుండా అలా వుండిపోయింది. సో, ప్రస్తుతానికి హీరో, డైరక్టర్ కాంబినేషన్ మాత్రం ప్రకటించి వదిలేస్తారు.
ఇది బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ నే. కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, సినిమాలు చకచకా చేయకుండా, బన్నీ ఈ నాన్చడం అన్నదే.
తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్