బయోపిక్ అటు ఇటు కిక్

ఎన్టీఆర్ బయోపిక్ చకచకా ముస్తాబవుతోంది. నిమిషం నుంచి నిమిషాల పాత్రల్లో బోలెడు మంది తారాగణం కనిపించడం అన్నది ఆ సినిమా అమ్మకాలు, బాహుబలి వన్ రేంజ్ లో సాగడానికి ఒకకారణం. ఆంధ్ర ఏరియాను నలభై…

ఎన్టీఆర్ బయోపిక్ చకచకా ముస్తాబవుతోంది. నిమిషం నుంచి నిమిషాల పాత్రల్లో బోలెడు మంది తారాగణం కనిపించడం అన్నది ఆ సినిమా అమ్మకాలు, బాహుబలి వన్ రేంజ్ లో సాగడానికి ఒకకారణం. ఆంధ్ర ఏరియాను నలభై నుంచి నలభై అయిదుకోట్ల రేంజ్ లో మార్కెట్ చేస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఆంధ్ర ఏరియా 21కోట్ల వరకు వసూలు చేసింది. అంటే ఈ సినిమా దానికి రెట్టింపు వసూలు చేయాలన్నమాట.  సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బాలయ్య అభిమానులే ఈ సినిమాకు కీలకంగా శ్రీరామరక్ష.

సంక్రాంతి సీజన్ కు రావడం కూడా ఓ మంచికారణం. కానీ సమస్య అల్లా, ఇదే సంక్రాంతి మరో రెండు మాస్, భారీ సినిమాలు రావడం. ఈ రెండు సినిమాల ధాటిని, ఎన్టీఆర్ బయోపిక్ తట్టుకోవాలి. రామ్ చరణ్-బోయపాటి సినిమా వినయ విధేయరామ విడుదల దాదాపు పక్కా అయిపోయింది. జనవరి 9న బయోపిక్ వస్తుంటే, జస్ట్ మూడురోజులు గ్యాప్ ఇచ్చి 11న ఈ సినిమా వచ్చేస్తోంది. ఓపెనింగ్స్ మామూలుగా వుండవు. కచ్చితంగా కుమ్ముతాయి. ఆ టైమ్ లో మరి బయోపిక్ కాస్త పక్కకు వుండాల్సిందే.

ఇదిలా వుంటే ఆ వెంటనే వెంకీ-వరుణ్ తేజ్ ల ఎఫ్ 2 వస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఫన్. పైగా ఇప్పటివరకు అన్నీ ఈ జోనర్ లో మాంచి సినిమాలే ఇచ్చిన అనిల్ రావిపూడి చేస్తున్న సినిమా. అందువల్ల ఎంటర్ టైన్ మెంట్ మినిమమ్ గ్యారంటీ వుంటుంది.

సంక్రాంతి సీజన్ అంటే ఎంటర్ టైన్ మెంట్ సినిమాలదే పెద్దపీట. అందువల్ల ఫస్ట్, అండ్ సెకండ్ చాయిస్ గా చరణ్, వెంకీ-వరుణ్ ల సినిమాలే వుంటాయి. అందులో సందేహంలేదు. ఎంత ఎన్టీఆర్ మీద అభిమానం వున్నా, తలా సినిమాలోంచి తలా సీన్, తలా పాట కలిపిన సినిమా అనేసరికి కాస్త ఎంటర్ టైన్ మెంట్ తక్కువే అనిపిస్తుంది.

మహానటి సినిమాకు అడ్వాంటేజ్ ఏమిటంటే, సావిత్రి ఎలా వుంటుంది అన్నది ఈ జనరేషన్ కు చాలావరకు గుర్తులేదు. కానీ ఎన్టీఆర్ అలా కాదు. ఎన్టీఆర్ సినిమాలు అలా టీవీలో వస్తూనే వుంటాయి. ఆ హావభావాలు అన్నీ కళ్ల ముందు గుర్తే.

ఆ గుర్తులను బాలయ్య అధిగమించగలగాలి. పైగా మహానటిలో సినిమా షూటింగ్ వ్యవహారాలు అంతంతమాత్రం. పైగా గెటప్ లు వుండవు. బయోపిక్ లో 60కి పైగా గెటప్ ల్లో బాలయ్యను చూపిస్తారు. ఇది ఫ్యాన్స్ వైపు నుంచి అడ్వాంటేజ్. మిగిలిన వారి వైపు నుంచి డిస్ అడ్వాంటేజ్.

ఈ అడ్వాంటేజ్ లు, డిస్ అడ్వాంటేజ్ లను తోడు చేసుకుని, రెండు భారీ మాస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలను ఢీకొని, నాన్ బాహుబలి రికార్డులు సృష్టిస్తే, అప్పుడు బయ్యర్లు గట్టెక్కుతారు. మొత్తంమీద రాబోయే సంక్రాంతి పండుగ మూడురోజులు, మూడు సినిమాలు చూడగలిగే అవకాశం మాత్రం సినిమా అభిమానులకు పెద్దకానుకే.

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్