ఎస్వీరంగారావుగా ప్రకాష్ రాజ్ అన్న హెడ్డింగ్ చూడగానే ఎన్టీఆర్ బయోపిక్ లోనో, లేదా ఇంకే జీవితగాథల సినిమాలోనో అని పొరపాటు పడక్కరలేదు. ఇది వేరే వ్యవహారం. ఈవీవీ సత్యనారాయణ చేసిన ఓ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం అలనాటి నటుడు జగ్గయ్య టైపులో కనిపిస్తాడు. అలాగే మాట్లాడతాడు. అలాగే గెటప్ లో వుంటాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా అదే టైపు అన్నమాట.
లండన్ లో వుంటూ ఎస్వీరంగారావు తండ్రి పాత్రలకు ప్రభావితం అయిన వ్యక్తిగా కనిపిస్తాడన్నమాట. అతగాడికి ఇద్దరు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లను అన్నాదమ్ములకే, ఒకే ఇంటికే ఇవ్వాలని కోరిక. ఇలాంటి థ్రెడ్ ఒకటి ఎఫ్ 2 సినిమాలో కీలకంగా కనిపిస్తుందట.
అనిల్ రావిపూడి డైరక్షన్ లో వెంకీ-వరుణ్ తేజ్ లు ఈ సినిమా చేస్తున్నారు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ముస్తాబవుతోందట ఈ సినిమా. వెంకీ మళ్లీ అప్పట్లో చేసిన, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు టైపు కామెడీ పండించినట్లు బోగట్టా. పెళ్లాంతో విసిగిన వెంకీ, పెళ్లి చేసుకోవాలనుకునే వరుణ్, వీళ్ల హీరోయిన్లు ఈ సంక్రాంతికి రాబోతున్నారు.
తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్