Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రోబో 2.0 @ 72 కోట్లు

రోబో 2.0 @ 72 కోట్లు

మొత్తానికి రోబో 2.0 తెలుగు హక్కుల లెక్క తేలింది. ఎన్వీప్రసాద్(తిరుపతి ప్రసాద్), దిల్ రాజు, యువి వంశీ కలిపి తెలుగు రాష్ట్రాల హక్కులను 72 కోట్ల రికవరబుల్ అడ్వాన్స్ కు తీసుకున్నారు. ఆరంభంలో వచ్చిన రేటు కన్నా ఇది ఎనిమిది కోట్లు తక్కువే. అప్పట్లో ఏషియన్ సునీల్, దగ్గుబాటి సురేష్ బాబు, రిలయన్స్ కలిపి 78 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ సినిమా లేట్ కావడంతో అడ్వాన్స్ కొంత వెనక్కు తీసుకున్నారు.

ఇప్పుడు కుదిరిన 72 కోట్లలో, ఏషియన్ కు వెనక్కు ఇవ్వాల్సింది, అలాగే కాలా సినిమాకు తిరుపతి ప్రసాద్ కు వెనక్కు రావాల్సింది కూడా మినహాయిస్తారు. ఈసారి స్పెషాలిటీ ఏమిటంటే, వీలయినంత వరకు జిల్లాల వారీ హక్కులు అమ్మేయాలని అనుకోవడం. కొన్న ముగ్గురికి నైజాం, కృష్ణ, గుంటూరు, వైజాగ్, నెల్లూరు, సీడెడ్ లో డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లు వున్నాయి. కానీ వీలయినంత వరకు అమ్మాలనే చూస్తున్నట్లు తెలుస్తోంది.

వైజాగ్ కు 9 కోట్లు చెబుతున్నట్లు వినికిడి. అంటే ఆంధ్ర నలభైకోట్ల రేషియోలో చెబుతున్నట్లు అన్నమాట. ఈ లెక్కన ఎవరు ముందుకు వస్తారో చూడాలి.

నోరున్న అనితకు టికెట్ హుళక్కేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?