Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ఆర్ఆర్ లో విదేశీ హీరోయిన్

ఆర్ఆర్ఆర్ లో విదేశీ హీరోయిన్

ఆర్ ఆర్ ఆర్ సినిమా మరో నాలుగయిదు రోజుల్లో సెట్ మీదకు వెళ్లబోతోంది. తొలిరోజు హడావుడి మీద బోలెడు ఊహాగానాలు వున్నాయి. వినిపిస్తున్నాయి. ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా వస్తాడని ఇంకా.. ఇంకా.. కానీ ప్రభాస్ విదేశాల్లో వున్నారు. వస్తే, దీనికోసం ఫ్రత్యేకంగా రావాలి. అందువల్ల అనుమానమే వస్తారా? అన్నది.

క్లోజ్డ్ సర్కిల్ లో సింపుల్ గా చేసేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా వుంటే సినిమాలో వుండేది ఇద్దరు హీరోయిన్లు కాదు, ముగ్గురు అని కూడా తెలుస్తోంది. మూడో హీరోయిన్ విదేశీ అమ్మాయి వుంటుందని వినికిడి. సినిమా బ్రిటిష్ కాలం నాటి కథతో జరుగుతుంది కాబట్టి, ఓ ఫారిన్ ఫేస్ అవసరం వున్నట్లు తెలుస్తోంది.

అలా అని నోటెడ్ ఫిగర్ ను ఎవ్వరినీ తీసుకురారు. కాస్త అందంగా వున్న ఫారిన్ అమ్మాయిని తీసుకుంటారని తెలుస్తోంది. మిగిలిన ఇద్దరు హీరోయిన్లు ఎవరన్నది ఇంకా సస్సెన్స్ గానే వుంది. రాశీఖన్నా పేరు ఒకటి ఆ మధ్య వినిపించింది. కానీ అదేమీ ఖరారు అయితే కాదు.

ఆర్ఆర్ఆర్ సినిమా తొలిషాట్ వేళకు హీరోయిన్ల పరిచయం వుంటుందని, కాదు ముహుర్తాలు సరైనవి లేవు కనుక, స్టార్ట్ చేసేస్తున్నారని, జనవరి వేళకు కానీ హీరోయిన్లు రారు అని రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి.

నోరున్న అనితకు టికెట్ హుళక్కేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?