Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

నిత్య మీనన్.. సావిత్రి వచ్చేసింది

నిత్య మీనన్.. సావిత్రి వచ్చేసింది

మహానటి సావిత్రి అంటే కీర్తిసురేష్ నే అన్నంతగా ముద్రవేసేసింది ఆ సినిమా. మరొకర్ని సావిత్రిగా ఊహించుకోలేనంతగా చూపించింది మహానటి సినిమా. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో మాత్రం సావిత్రి క్యారెక్టర్ ను నిత్యమీనన్ ను తీసుకున్నారు. సావిత్రి మాదిరిగా బొద్దుగా వుంటుందని తీసుకున్నారేమో?

సావిత్రిగా నిత్యమీనన్ ఎలా కనిపిస్తుంది అన్న సందేహాలు తీరిపోయేలా, లుక్ బయటకు వదిలారు. గుండమ్మకథలో ఎన్టీఆర్ పప్పురుబ్బుతుంటే, పక్కన బుల్లెమ్మగా సావిత్రి కనిపించడం ఆ సినిమా చూసిన వారందరికీ గుర్తున్నదే. 

ఎన్టీఆర్ సినిమాల్లోని అనేకానేక ఐకానిక్ సీన్లను మళ్లీ బయోపిక్ లో చూపిస్తున్నట్లుగానే, ఈసీన్ ను కూడా చూపించబోతున్నారు. ఈ సీన్లో మోటు, మొరటు మనిషిగా బాలయ్య, పక్కన బుల్లెమ్మగా నిత్యమీనన్ కనిపిస్తారు. ఆ స్టిల్ నే ఇప్పుడు బయటకు విడుదల చేసారు.

నోరున్న అనితకు టికెట్ హుళక్కేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?