Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

చరణ్ - రాజమౌళి ఫిక్సేనా?

చరణ్ - రాజమౌళి ఫిక్సేనా?

బాహుబలి సీరీస్ తరువాత రాజమౌళి సినిమా ఎవరితో అన్న ప్రశ్న, దానికి అనేకానేక జవాబులు అలా చక్కర్లు కొడుతూనే వున్నాయి. జై లవకుశ చూసిన తరువాత రాజమౌళి ఫిక్సయ్యే అవకాశం వుందనీ వార్తలు వచ్చాయి. అయితే దేనికీ పునాదీ, ప్రాతిపదికా లేదు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తుంటే మాత్రం, రాజమౌళి కావాలని లీడ్ ఇస్తున్నారా? అనిపిస్తోంది. 

సైరా ఫంక్షన్ కు రాజమౌళిని ప్రత్యేకంగా ఆహ్వానించడం, శ్రీవల్లి ఫంక్షన్ కు రామ్ చరణ్ రావడంతో కొత్త వార్తలు పుట్టుకువచ్చాయి. ఇప్పుడు రంగస్థలం షూటింగ్ స్పాట్ కు రాజమౌళి ప్రత్యేకంగా పని కట్టుకు హాజరుకావడం ఆ వార్తలకు బలాన్నిస్తోంది. అదే సమయంలో మెగాస్టార్ అక్కడకు వెళ్లడం కూడా ఆసక్తికరమే.

పైగా రాజమౌళి తరువాతి సినిమా చేయాల్సింది నిర్మాత దానయ్యకు. అదే దానయ్యకు రామ్ చరణ్ ఓ సినిమా చేయాల్సి వుంది. ఆ సంగతి అలా వుంచితే లైన్లో తరువాత సినిమా అంటూలేని టాప్ హీరోలు లేరు. కేవలం రామ్ చరణ్, బన్నీ మాత్రమే వున్నారు. ఎన్టీఆర్, పవన్, మహేష్ బాబు, ప్రభాస్ అంతా బిజీనే. కానీ బన్నీతో ఎందుకో రాజమౌళి సినిమా చేయరనే గుసగుసలు వున్నాయి. అందువల్లే రామ్ చరణ్ బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నారేమో?

మరోపక్క రాజమౌళికి ఇద్దరు హీరోలతో చేయాలని వుందని, అవసరం అయితే చరణ్, ఎన్టీఆర్ మంచి మిత్రులు కాబట్టి, ఇద్దరితో చేయవచ్చని మరో టాక్. ఇవన్నీకాక, హిట్ నో, ఫ్లాప్ నో రామ్ చరణ్ బాలీవుడ్ కు కూడా పరిచయమే. రాజమౌళి బ్రాండ్, పరిచయం వున్న హీరో అయితే సినిమాను అక్కడకు కూడా తీసుకెళ్లవచ్చని మరో పాయింట్. ఇలా మొత్తంమీద మెల్ల మెల్లగా రాజమౌళి అయిడియా బయటకు వస్తోందేమో? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?