శర్వానంద్ హీరోగా మారుతి డైరక్షన్ లో తయారైన మహానుభావుడు సినిమా కూడా సెన్సార్ ఫార్మాలిటీలు పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. వాస్తవానికి ఈ సినిమాకు యు సర్టిఫికెట్ వస్తుందని అనుకున్నారు.
సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఆఫీస్ బ్యాక్ డ్రాప్ కామెడీ అండ్ లవ్, అలాగే ద్వితీయార్థం అంతా విలేజ్ కామెడీ అండ్ ఎమోషన్లతో సాగుతుంది. క్లయిమాక్స్ లోనే చిన్న యాక్షన్ సీన్ వుంటుంది. అందువల్ల యు సర్టిఫికెట్ వస్తుందనుకున్నారు.
అయితే సినిమా ఫస్ట్ హాఫ్ లో ఓ పాత్ర చిన్న బ్లడ్ వామిటింగ్ చేయడం, హీరోయిన్ ముద్దు అడిగే సీన్, క్లయిమాక్స్ ఫైట్ అన్నీ కలిపి యు/ఎ కి దారి తీసాయి. అయితే కట్స్ ఏమీ పడలేదు. సినిమా చూసి సెన్సార్ సభ్యులంతా ఫుల్ గా నవ్వుకున్నారని యూనిట్ వర్గాల బోగట్టా. యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా దసరా సందర్భంగా ఈ నెలాఖరున విడుదలవుతుంది.