ఒకే తరహా మాస్ సినిమాలు చేస్తున్నాడనే విమర్శలకి తోడు వరుసగా వచ్చిన పరాజయాలు రామ్ చరణ్‌ని ఇబ్బందుల్లోకి నెట్టినపుడు ఇమేజ్ మేక్ఓవర్ కోసం చేసిన సినిమా ధృవ. తమిళంలో విజయవంతమైన తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి చరణ్ సాహసించాడు. విలన్‌కి ప్రాధాన్యమున్న కథని చరణ్ ఎంచుకోవడంలోనే ధృవ క్లిక్ అయింది.
గత డిసెంబర్లో వచ్చిన ఆ చిత్రంతో చరణ్‌కి డిఫరెంట్ ఇమేజ్ రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. చరణ్‌లానే మూస సినిమాల ఊబిలో పడి ఇబ్బందులు పడ్డ సాయి ధరమ్ తేజ్ 'జవాన్'తో సిమిలర్ అటెంప్ట్ చేస్తున్నాడు. జవాన్ ట్రెయిలర్ చూడగానే ముందుగా ఎవరికైనా ధృవ గుర్తుకు వస్తుంది.
ఇది కూడా డిసెంబర్లోనే రిలీజ్ అవుతోంది. గత చిత్రాలు తీవ్రంగా నిరాశ పరచడంతో దీనిపై తేజ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. చరణ్‌కి ధృవతో వచ్చిన సక్సెస్ మరి అతని కజిన్ అయిన తేజ్‌కి కూడా రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి. దిల్ రాజు ఆధ్వర్యంలో వస్తోన్న ఈ చిత్రానికి పబ్లిసిటీ హంగామా అయితే గట్టిగానే జరుగుతోంది.