బౌన్స్‌ బ్యాక్‌ అంటే ఇదీ

హీరోలకి వున్నట్టుగా హీరోయిన్లకి లాంగ్‌ స్టాండిగ్‌ కెరీర్‌ వుండదిక్కడ. ఏ హీరోయిన్‌ షెల్ఫ్‌ లైఫ్‌ అయినా అయిదారేళ్లలో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా హ్యాంగ్‌ ఇన్‌ అయ్యేవాళ్లు వుంటారు కానీ కెరీర్‌ పీక్స్‌లో వున్నప్పుడు…

హీరోలకి వున్నట్టుగా హీరోయిన్లకి లాంగ్‌ స్టాండిగ్‌ కెరీర్‌ వుండదిక్కడ. ఏ హీరోయిన్‌ షెల్ఫ్‌ లైఫ్‌ అయినా అయిదారేళ్లలో ముగుస్తుంది. ఆ తర్వాత కూడా హ్యాంగ్‌ ఇన్‌ అయ్యేవాళ్లు వుంటారు కానీ కెరీర్‌ పీక్స్‌లో వున్నప్పుడు చేసిన సినిమాలు ఆ తర్వాత మాత్రం రావు. కానీ కాజల్‌ అగర్వాల్‌ మాత్రం ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గానే కొనసాగుతోంది.

తన కెరీర్‌ ముగిసిందని అనిపించినప్పుడల్లా ఆమె బౌన్స్‌ బ్యాక్‌ అయింది. గత ఏడాది సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, బ్రహ్మూత్సవం లాంటి డిజాస్టర్స్‌లో నటించిన కాజల్‌కి తమిళ్‌, హిందీలో కూడా కలిసి రాలేదు. ఇక కాజల్‌ పని అయిపోయినట్టే అనుకుంటూ వుండగా చిరంజీవి సరసన నటించడానికి ఓకే చెప్పి సర్‌ప్రైజ్‌ చేసింది. తనకంటే వయసులో చాలా పెద్ద అయిన చిరంజీవితో నటించి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన కాజల్‌ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.

నేనే రాజు నేనే మంత్రి, మెర్సల్‌ (అదిరింది) చిత్రాలతో కాజల్‌ ఇప్పుడు హాట్‌ అయిపోయింది. ఆమెని సైన్‌ చేసుకోవడానికి అటు సీనియర్లు, ఇటు జూనియర్లు పోటీలు పడుతున్నారు. తన అనుభవంతో పారితోషికం పరంగా ఫ్లెక్సిబులిటీ చూపిస్తూ కాజల్‌ కూడా అదరగొడుతోంది. ఈమధ్య కాలంలో ఇలాంటి బౌన్స్‌ బ్యాక్‌ చూడలేదంటే అతిశయోక్తి కాదు. కీపిటప్‌ కాజల్‌.