తనకు ఫేస్ బుక్ లో కోటి మంది ఫాలోయర్లు ఉన్నారని గర్వంగా సెలబ్రేట్ చేసుకొంటున్నాడు అల్లు అర్జున్. ఇటీవలే బన్నీ ట్విటర్ అకౌంట్ ఆ మార్కును రీచ్ అయ్యింది. ఈ ఫీట్ ద్వారా టాలీవుడ్ హీరోలందరిపై పై చేయి సాధించాడు అల్లు అర్జున్. మరి ఇప్పుడు మిగతా వాళ్లుఎవరూ భుజాలు తడుముకునే అవకాశాలు లేవు కానీ.. ఫేస్ బుక్ లోనే అకౌంట్ కలిగిన మరో మెగా హీరో చరణ్ నే బన్నీతో పోల్చాల్సి వస్తోంది. ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండే మెగా పవర్ స్టార్ ఫాలోయర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటం కూడా ఇక్కడ చర్చనీయాంశం అవుతోంది!
బన్నీ, చరణ్ లిద్దరికీ ట్విటర్ అకౌంట్లు లేవు. వీళ్లు అభిమాలనులకు ఫేస్ బుక్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్నారు. వీళ్ల అకౌంట్లుదాదాపు ఒకేసారి ప్రారంభం అయ్యాయి. అయితే ఫాలోయర్ల సంఖ్య విషయంలో అల్లు అర్జున్ కోటి ఫీట్ కు రీచ్ కాగా.. ప్రస్తుతానికి చెర్రీకి కేవలం ముప్పై రెండు లకల చిల్లర ఫాలోయర్లు ఉన్నారు! అంటే బన్నీతో పోల్చుకుంటే చెర్రీకి ఉన్న ఫాలోయర్ల సంఖ్య మూడో వంతు మాత్రమే!
తద్వారా మెగా ఫ్యామిలీలో ఎక్కువ ఫాలోయింగ్ కలిగిన హీరో గా బన్నీ నిలుస్తున్నాడు. చిరంజీవి తనయుడి కన్నా.. మేనల్లుడికే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోందిక్కడ. అసలే.. చెర్రీ, బన్నీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది.. బన్నీ స్వయంగా ఒక ఫ్యాన్స్ అసోషియేషన్ కూడా స్టార్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ బన్నీ కోటి ఫీటు.. చెర్రీని తక్కువ చేసి చూపేదేనేమో!