చీక‌టి రాజ్యం… క‌మ‌ల్‌ – త్రిష‌ల ఢిష్యుం ఢిష్యుం…

ప్రస్తుతం షూటింగ్  జ‌రుపుకుంటున్న విల‌క్షణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్  సినిమా చీక‌టి  రాజ్యంలో క‌మ‌ల్‌-త్రిష‌ల మ‌ధ్య ముద్దు సీన్‌ ఉందో లేదో గాని… అద్భుత‌మైన  ఫైట్ సీన్ ఉంది. ఆంగ్ల సినిమా త‌ర‌హాలో వీరిద్దరి మ‌ధ్యా…

ప్రస్తుతం షూటింగ్  జ‌రుపుకుంటున్న విల‌క్షణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్  సినిమా చీక‌టి  రాజ్యంలో క‌మ‌ల్‌-త్రిష‌ల మ‌ధ్య ముద్దు సీన్‌ ఉందో లేదో గాని… అద్భుత‌మైన  ఫైట్ సీన్ ఉంది. ఆంగ్ల సినిమా త‌ర‌హాలో వీరిద్దరి మ‌ధ్యా  చిత్రీక‌రించిన ఆ పోరాట స‌న్నివేశాన్ని ఫ్రెంచ్ స్టంట్స్‌మ‌న్లు  గిల్లెస్ కాన్సీల్‌,  సిల్వైన్ గాబెట్, వ‌ర్జిన్ అర్నాడ్‌లు తీర్చిదిద్దారు. ఈ పోరాట స‌న్నివేశం  కాస్త లెంగ్తీ గానే ఉంటుంద‌ట‌. 

ఇటీవ‌ల అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ సెట్స్ కు వెళ్లిన శృతి హాస‌న్ ఈ ఫైట్ సీన్ చిత్రీక‌ర‌ణ చూసి మైమ‌ర‌చిపోయింది.  డాడీ- త్రిష‌ల మ‌ధ్య ఫైట్ అత్యంత స‌హ‌జంగా ఉన్నదంటూ ప్రశంస‌లు కూడా కురిపించింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో త్రిష హాలీవుడ్ బేబ్స్ త‌ర‌హాలో ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా క‌న‌పిస్తుంది. ఇప్పటిదాకా త్రిష‌ను తెర‌పై చూడ‌ని విధంగా అస‌లు గ‌తంలో ఏ హీరోయిన్‌నూ తెర‌పై చూడ‌ని విధంగా ఉంటుంద‌ని స‌మాచారం.  

ఫ్రెంచి సినిమా స్లీప్‌లెస్ నైట్స్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో మ‌నీషాకొయిరాలా, మ‌ధుశాలిని వంటి తార‌లు కూడా న‌టిస్తున్నారు.