28 డేట్ భలే ‘చిక్కుకుంది’

మన టాలీవుడ్ కు ఏనాడో మార్నింగ్ షోలు లేని కాలంలో ఫిక్సయింది ఫ్రైడే రిలీజ్ అన్నది. అలా సాగిపోతోంది. సరే, ఆ సంగతి అలా వుంచితే, ఈ నెల 21న కిక్ 2 విడుదలవుతోంది.…

మన టాలీవుడ్ కు ఏనాడో మార్నింగ్ షోలు లేని కాలంలో ఫిక్సయింది ఫ్రైడే రిలీజ్ అన్నది. అలా సాగిపోతోంది. సరే, ఆ సంగతి అలా వుంచితే, ఈ నెల 21న కిక్ 2 విడుదలవుతోంది. 4న రుద్రమదేవి. రెండు పెద్ద సినిమాలు వుండగా మధ్యన వచ్చే శుక్రవారాన్ని కాస్త వదిలేయడం కూడా మామూలే ఎందుకంటే వారం గ్యాప్ ఇవ్వాలని, వారంలో తీసేయాల్సి వస్తుందని. అలా వుండిపోయింది ఇప్పుడు ఆగస్టు 28.

అయితే రుద్రమదేవి విడుదలపై ఇంకా చిన్న చిన్న సందేహాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఇంకా సెన్సార్ కు వెళ్లలేదు. దానికి ఇంకా టైమ్ వుంది. బాహుబలి ఇచ్చిన డబ్బులతో కర్ణాటక బయ్యర్ వచ్చి ఎడాపెడా కొనేసాడు దాంతో మార్కెటింగ్ సమస్య తీరింది. కానీ ఇంకా కొంచెం ఫైనాన్సియల్ ఇస్యూస్ వున్నాయని టాక్ వినిపిస్తోంది.

అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఒకవేళ రుద్రమదేవి రాకపోతే రెండు డేట్ లు వృధాగా పోతాయి. 28, సెప్టెంబర్ 4. కొన్ని సినిమాలు రెడీ అయి వున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలు రుద్రమదేవి వ్యవహారాలను వాచ్ చేస్తున్నాయి. ఏ మాత్రం ఉప్పు అందినా, తమ సినిమాల వేసుకోవడం కోసం. అలాంటి జాబితాలో ముందు వుంది మంచు విష్ణు డైనమైట్. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయివుంది. అక్టోబర్ కు డేట్ ఇచ్చారు. కానీ ఒక వేళ, ఏ  పరిస్థితుల్లో అయినా రుద్రమదేవి రాకుంటే ఆ డేట్ కు రావాలని విష్ణు ఆలోచిస్తున్నాడు.