బాబి డైరక్షన్ మాత్రమేనంట

మొత్తానికి గబ్బర్ సింగ్ 2 అనే సర్దార్ గబ్బర్ సింగ్ కు డైరక్టర్ రవీంద్ర అలియాస్ బాబి కేవలం డైరక్షన్ కే పరిమితం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమాకు కథను పవన్ సమకూర్చుతున్న సంగతి…

మొత్తానికి గబ్బర్ సింగ్ 2 అనే సర్దార్ గబ్బర్ సింగ్ కు డైరక్టర్ రవీంద్ర అలియాస్ బాబి కేవలం డైరక్షన్ కే పరిమితం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ సినిమాకు కథను పవన్ సమకూర్చుతున్న సంగతి తెలిసిందే. దాన్ని సంపత్ నంది దాదాపు ఫినిష్ చేసాడు. నచ్చక, మళ్లీ మార్పులు చేర్పులు చేసారు.

మాటలను గోపాల గోపాల సినిమాకు అందించిన బుర్రా సాయి మాధవ్ కు అప్పగించారని కొన్నాళ్ల కిందటే వెల్లడించాం. ఇప్పుడు సాయి మాధవ్ నే స్వయంగా ఈ విషయం ధృవీకరించారు. అంటే ఈ సినిమాకి రచయిత అయిన బాబి మాటలు అందించడం లేదన్నమాట. కథ, మాటలు పోగా మిగిలింది డైరక్షన్. మరి అది అయినా చేయనిస్తారో, పవన్ బ్యాక్ సీట్ డైరక్షన్ చేస్తారో? ఎందుకంటే మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ నే పవన్ డిజైన్ చేసాడన్నారు.

అంటే మరి డైరక్షన్ లో మాత్రం ఆయన తన మార్క్ లేకుండా ఎందుకు వదుల్తారు? ఏదో విధంగా ఈ సినిమా పూర్తయి బయటపడితే, ముందుగా ఊపిరి పీల్చుకనేది బాబీయేనేమో? ఫుల్ ఫ్రీడమ్ ప్లస్ ఫుల్ టాలెంట్ తో మరో సినిమా చేసుకుంటాడు.