గీతా క్యాంప్ లో అప్పల్రాజులెందరో?

రామ్ గోపాల్ వర్మ అప్పల్రాజు గుర్తున్నాడా..మంచి సినిమా తీద్దామని వస్తే, అందరూ కలిసి, ఏదో చేసి, మరేదో తీయిస్తారు. అచ్చంగా అలాంటి వైనమే గుర్తు వస్తోందట చాలా మందికి గీతా ఆర్ట్స్ క్యాంప్ లో.…

రామ్ గోపాల్ వర్మ అప్పల్రాజు గుర్తున్నాడా..మంచి సినిమా తీద్దామని వస్తే, అందరూ కలిసి, ఏదో చేసి, మరేదో తీయిస్తారు. అచ్చంగా అలాంటి వైనమే గుర్తు వస్తోందట చాలా మందికి గీతా ఆర్ట్స్ క్యాంప్ లో. ఔత్సాహికులకు, కాస్త టాలెంట్ వున్న వారికి మంచి అవకాశాలు వచ్చే వీలుంది గీతా ఆర్ట్స్ లో.

కానీ, సమస్య ఏమిటంటే అరవింద్ ను మెప్పించడం ఒకంతట వీలు కాదు. దానికి నెల పట్టొచ్చు..ఏడాది పట్టొచ్చు..ఇంకా పని కాకుండా బయటకు వచ్చేయచ్చు. కానీ వీళ్లు పట్టుకెళ్లిన కథ వీళ్లకే గుర్తు రానంతంగా మారిపోతుందని వినికిడి. కాస్త టాలెంట్ వుండి, మంచి లైన్ వుండి గీతా ఆర్ట్స్ లో అడుగు పెడితే, వెంటనే గ్రీన్ సిగ్నల్ ముందు వచ్చేస్తుంది. లక్ష అడ్వాన్స్ వచ్చినా వస్తుంది. కానీ అక్కడి నుంచి మొదలవుతుంది.

అసలు కథ. ఇటు మార్చడం..అటు మార్చడం..ఇక్కడ చేర్చడం. అక్కడ చేర్చడం. అలా ఆ కథ నడుస్తూనే వుంటుంది. నెలలు గడిచిపోతాయి. సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో ఎవరికీ తెలియదు. ఓపిగ్గా కూర్చుని వుండాల్సిందే. పరుశురామ్, ఈటీవీ ప్రభాకర్, సాయిరాజేష్ ఇలాంటి పేర్లు కొన్ని అలాంటి వాళ్లలో.

తీరా చేసి అదృష్టం బాగుండి సినిమా పట్టాలకెక్కినా, వీళ్లు పట్టుకువెళ్లిన తొలి కథ మాత్రం వుండదు. ఓ కొత్త కథ వుంటుంది. అదే తయారవుతుంది. సర్లే పేరు మనకే వచ్చింది కదా అని సంతోషపడడమే. ఇలాంటి జనాలు, ఇలాంటి ప్రాజెక్టులు గీతాలో ఇప్పటికి డజన్ల కొద్దీ వున్నాయని వినికిడి.