ఎక్కడైనా అక్కలు చెల్లెళ్లకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంటారు. అక్కదారిలోనే మేమూ వెళతానంటూ చెల్లెళ్లు చెబుతుంటారు. కానీ మన చందమామ కాజల్ విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. తొలి నుంచీ కెరీర్ విషయంలో కాజల్‌కి నిషా అగర్వాల్ సలహాలిస్తుంటుంది. అది కాజల్‌కి బాగానే వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ప్రేమ విషయంలోనూ నిషానే ఫాలో అయ్యింది కాజల్.
నిషా అగర్వాల్ ఇటీవలే ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్‌ని ప్రేమించి పెళ్లి చేసుకొంది. అక్క కంటే ముందు ఏడడుగులు నడిచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు కాజల్ కూడా సేమ్ టు సేమ్ ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను చూసి ప్రేమించేసిందట. ఆ జంట కలిసి ఫారిన్‌లో ఎంజాయ్ చేస్తోందట.
ఆ విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాజల్ త్వరలోనే పెళ్లి కబురు వినిపించొచ్చని సమాచారం. ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవ్వడమే ఆలస్యమని ఆమె సన్నిహితులు చెబుతున్నారట.