కాకతాళీయమే అయినా కానీ పవన్, మహేష్, ఎన్టీఆర్ అందరి కెరీర్స్‌లో కొన్ని నంబర్స్ సిమిలర్ రిజల్ట్స్ ఇచ్చాయి. వారు నటించిన ఏడవ సినిమాలన్నీ వారికి ఘన విజయాల్ని అందించాయి. ఆ వెంటనే వచ్చిన సినిమాలు దారుణంగా పరాజయం పాలయ్యాయి. చరణ్ కెరీర్‌లో కూడా సదరు నంబర్స్ సిమిలర్ రిజల్ట్స్ ఇస్తాయనే ఫీలింగ్ ఫాన్స్‌కుంది.
చరణ్ ఏడో సినిమా ఎవడు సక్సెస్ అయింది. మరీ ఖుషీ, ఒక్కడు, సింహాద్రి రేంజ్‌లో కాకున్నా చరణ్‌కి ఎవడుతో చెప్పుకోతగ్గ విజయం దక్కింది. ఆ లెక్కన చరణ్‌కి కూడా ఏడో నంబర్ సెంటిమెంట్ కలిసొచ్చినట్టే. ఆ లెక్కన చూసుకుంటే అతని తదుపరి సినిమాని బ్యాడ్ సెంటిమెంట్ భయపెడుతోంది.
జానీ, నిజం, ఆంధ్రావాలాలా చరణ్ ఎనిమిదో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిలవుతుందేమో అని సెంటిమెంట్‌ని నమ్మే వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలే ఫామ్‌లో లేని కృష్ణవంశీ, పెద్దగా ఆసక్తి రేకెత్తించని స్టార్స్ కాంబినేషన్ ఈ చిత్రంపై అంచనాలని తగ్గిస్తోండగా, ఈ సెంటిమెంట్ కూడా తోడవడంతో చరణ్‌పై ప్రెజర్ ఎక్కువైంది.