నిన్న మొన్నటి వరకు కెరీర్ తప్ప తనకే ధ్యాస లేదని చెప్పిన కాజల్ సడన్‌గా లవ్‌లో పడిందా? అవుననే అంటున్నాయి గాసిప్ సర్కిల్స్. ఈమధ్య కాజల్ ముంబయికి చెందిన ఒక వ్యాపారవేత్తతో క్లోజ్‌గా మూవ్ అవుతోందట. ఇక్కడైతే ఫోటోగ్రాఫర్లకి చిక్కిపోతానని విదేశాల్లో తన ప్రియుడితో చక్కర్లు కొడుతోందట.
తెలుగు చిత్ర పరిశ్రమలో నంబర్‌వన్ హీరోయిన్ అనిపించుకున్న కాజల్ తమిళంలో కూడా హిట్ చిత్రాల్లో నటించింది. హిందీలోను గుర్తింపు తెచ్చుకున్న కాజల్ మొన్నీమధ్య తన చెల్లెలు పెళ్లి జరిగినప్పుడు కూడా తన పెళ్లికి చాలా టైమ్ ఉందని, తానెవరినీ ప్రేమించడం లేదని తేల్చింది.
సడన్‌గా ఇతనితో లవ్‌లో పడిందా లేక ఎప్పట్నుంచో దాచి పెట్టిన రహస్యం ఇప్పుడు బయటపడిందా అనేది తెలీదు మరి. ఈమధ్య చాలా మంది హీరోయిన్లు వ్యాపారవేత్తలతోనే జీవితం పంచుకోవాలని చూస్తున్నారు. కాజల్ కూడా సినీ పరిశ్రమతో సంబంధం లేని వాడినే సెలక్ట్ చేసుకున్నట్టుంది. మరి ఈ ప్రేమాయణం పెళ్లి పీటల వరకు దారి తీస్తుందో లేదో చూడాలి.