తెలుగు సినిమా కొన్ని వారాలుగా చాలా స్ట్రగుల్ అవుతోంది. కొత్త సినిమాలకి కలెక్షన్లు లేకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. ‘ఎవడు’ తర్వాత వచ్చిన సినిమాల్లో అంతో ఇంతో ఫర్వాలేదనిపించిన సినిమా ‘హార్ట్ ఎటాక్’ ఒక్కటే. ప్రస్తుతం చాలా థియేటర్లకి కనీసం ఫీడింగ్ కూడా దక్కడం లేదు. నాని సినిమాలు రెండు వచ్చినా హోప్‌లెస్ అయిపోయాయి.
ఇక ఈవారంలో రాబోతున్న ‘భీమవరం బుల్లోడు’పైనే మార్కెట్ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. సునీల్‌కి మాస్‌లో ఫాలోయింగ్ బాగుంది కనుక, సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్‌పై సక్సెస్ రేట్ ఎక్కువ కనుక ‘భీమవరం బుల్లోడు’ మళ్లీ ఊపు తెస్తాడని అనుకుంటున్నారు.
అయితే సినిమాలపై ప్రేక్షకులు పూర్తిగా శీతకన్ను వేస్తున్నారనేది నిజం. పరీక్షల సమయం కావడం, రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కూడా సినిమా బిజినెస్‌ని దెబ్బ తీస్తున్నాయి. భీమవరం బుల్లోడు అయినా కాస్త సందడి చేయకపోతే ఇక వేసవిలో పెద్ద సినిమాలు వచ్చే వరకు బాక్సాఫీస్ వద్ద ఈ స్లంప్ కంటిన్యూ అయ్యే ప్రమాదముంది.