టాలీవుడ్ లో టాప్ స్టేటస్ లో ఉన్న ఒక స్టార్ హీరో క్రిస్టియానిటీ తీసుకొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్ట్ లో భాగస్వామి అయిన ఆ హీరోకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినీ వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఆ హీరో అందగాడిగా, అమ్మాయిల్లో మంచి గుర్తింపు ఉంది. దానికి తోడు కెరీర్ లో కొన్ని సూపర్ హిట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఒక మైథలాజికల్ సబ్జెక్టుతో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమాలో కూడా ఈ యువ హీరో నటిస్తున్నాడు. ఆ ప్రాజెక్టు అనేక రకాలుగా వార్తల్లోకి వస్తోంది. బడ్జెట్ తో సహా అనేక ప్రత్యేకతలున్నాయి ఆ సినిమాలో!
ఈ యువహీరో సినిమాల్లోకి రావడానికి కారణమైన పెద్దాయన భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా! ఉత్తరాంధ్రకు చెందిన ఒక అప్పర్ క్యాస్ట్ కు చెందిన ఈ హీరో ఉన్నట్టుండి ఇలా క్రైస్తవం స్వీకరించడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. క్రీస్తు మీద నమ్మకంతోనే ఆ యువహీరో ఇలా కన్ వర్ట్ అయ్యాడని తెలుస్తోంది.
ఈ విషయంపై అధికారిక ద్రువీకరణ లేదు. ఆ హీరోకు సన్నిహితులు అయిన వారు మాత్రం ఈ విషయంపై గుంభనంగా ఉన్నారు క్రిస్టియానిటీ స్వీకరిస్తే తప్పేంటి? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇదీ విషయం… మరి కెరీర్ అత్యంత పీక్ స్టేజిలో ఉన్న సమయంలో ఈ హీరో ఇలాంటి ప్రయోగం ఎందుకు చేశాడా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
ఏదో డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి అయితే.. మతం మారి, విశ్వాసాలను మార్చుకొన్నా సర్దుకోవచ్చు కానీ… ఆల్ ఈజ్ వెల్ గా ఉన్న వ్యక్తి ఇలా కన్ వర్ట్ కావడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశం గా మారింది!