బెల్లంకొండ సురేష్ చాలా తెలివైన నిర్మాత..ఎక్కడ పెట్టాలో..ఎక్కడ వదిలేయాలో బాగా తెలిసినవాడు. ఇప్పటికే అల్లుడి శీను ప్రకటనలు టీవీలో కుమ్మేస్తున్నాయి. రభస కు మాత్రం పబ్లిసటీ అంటే ఎక్కడా అన్నట్లు వుంది. ఈ సంగతి అలా వుంచితే అల్లుడి శీను, రభస సినిమాల తరువాత బెల్లంకొండ ఫైనాన్షియల్ గా బాగా దెబ్బతిన్నట్లు వినికిడి.
అందుకే తన కొడుకు రెండో సినిమా కు నిర్మాతగా తాను వ్యవహరించడం లేదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ఓ పెద్ద ప్రొడ్యూసర్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఏ టర్మ్స్ లపై అప్పగించారన్నది ఇంకా తెలియడం లేదు. ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. అప్పుడు బెల్లంకొండ కు వున్న ఆర్థిక లావాదేవీలు ఈ సినిమాకు అడ్డంకులు కాకుండా వుంటాయన్నది ఆలోచనగా తెలుస్తోంది.