Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చి.ల.సౌ.. వాయిదా?

చి.ల.సౌ.. వాయిదా?

ఇటీవల కాలంలో మాంచి బజ్ వచ్చిన మరో చిన్న సినిమా చి.ల.సౌ. ఈ సినిమాకు అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఫ్యామిలీ అంతాకలిసి సోషల్ నెట్ వర్క్ లో మాంచి బజ్ తీసుకువచ్చారు. సుశాంత్ నటించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ సినిమాకు సంబందించి వదిలిన టీజర్లకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ కూడా అవుతోంది.

ఈసినిమాను ఈనెల 27న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు వాయిదా వేయాలని ఆలోచిస్తున్నారు. అదేరోజు బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం సినిమా భారీగా విడుదలవుతోంది. మరోపక్క యువి క్రియేషన్స్ సపోర్ట్ తో హ్యాపీ వెడ్డింగ్ సినిమా వుంది. ఇందులో మెగా ఫ్యామిలీకి చెందిన నీహారిక హీరోయిన్ గా నటిస్తోంది.

పైగా థియేటర్లన్నీ చిన్నవో, పెద్దవో సినిమాలతో ఫుల్ గా వున్నాయి. చినబాబు, ఆర్ ఎక్స్ 100 థియేటర్లలోంచి ఇప్పుడే తీయరు. ఇలాంటి నేపథ్యంలోమంచి చిన్న సినిమా వదిలి ఇబ్బంది పడేకన్నా, వేరే డేట్ కు తీసుకువస్తే మంచిదని భావిస్తున్నారు. బహుశా ఆగస్టు 3 డేట్ ను పరిశీలిస్తున్నారు. కానీ అదేరోజు అన్నపూర్ణ సంస్థకు చెందిన సుప్రియ చాలాకాలం తరువాత నటించిన గూఢచారి సినిమా విడుదల వుంది.

మరి దానిమీద సుశాంత్ నటించిన సినిమాను వదుల్తారా? అన్నది అనుమానం. పోనీ మరింత వెనక్కు వెళ్లాలంటే తొమ్మిదిన శ్రీనివాస కళ్యాణం వుంది. మరి ఏం డిసైడ్ చేసుకుంటారో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?