హరీష్ శంకర్ కు ఎసరుపెట్టిన ఇంద్రగంటి

దిల్ రాజు బ్యానర్ లో ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాననే విషయాన్ని డీజే సినిమా టైమ్ లోనే ప్రకటించాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ ప్రాజెక్టుకు దాగుడు మూతలు అనే టైటిల్ ను కూడా…

దిల్ రాజు బ్యానర్ లో ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నాననే విషయాన్ని డీజే సినిమా టైమ్ లోనే ప్రకటించాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆ ప్రాజెక్టుకు దాగుడు మూతలు అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించి పెట్టించారు. సేమ్ టైం, హరీష్ శంకర్ అమెరికా వెళ్లి లొకేషన్లు కూడా కొన్ని చూసొచ్చాడు. కానీ ఇప్పుడా సినిమా ఆగిపోయేలా ఉంది.

దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్ లో దాగుడు మూతలు ప్రాజెక్టు దాదాపు లేనట్టే. ఈ ఏడాది ఆ సినిమా సెట్స్ పైకి రాదనే విషయాన్ని పరోక్షంగా బయటపెట్టాడు దిల్ రాజు. స్క్రిప్ట్ సెట్ అవ్వలేదంటూ ఆ టాపిక్ ను అంతటితో ఆపేశాడు.

“దాగుడుమూతలు అనుకున్నాం. స్క్రిప్ట్ ఇంకా సెట్ అవ్వట్లేదు. నేను, హరీష్ ఇద్దరం వర్క్ చేస్తున్నాం. కానీ ఎందుకో వర్కవుట్ కావట్లేదు. హరీష్ ప్రస్తుతం దానిమీదే ఉన్నాడు. ఆ స్క్రిప్ట్ చేస్తామా లేదా షిఫ్ట్ అవుతామా అనేది మరోవారం, 10రోజుల్లో తేలుస్తాను.”

ఇలా దాగుడుమూతలు ప్రాజెక్టు దాదాపు ఉండదనే విషయాన్ని దిల్ రాజు స్పష్టంచేశాడు. మరోవైపు ఇదే విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ కూడా నిర్థారించాడు. ఈ ఏడాది దిల్ రాజు బ్యానర్ నుంచి రాబోతున్న 5 సినిమాల్ని ప్రస్తావించిన హరీష్ శంకర్..  లిస్ట్ లో తన సినిమా లేనందుకు బాధను వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశాడు. కొన్నిసార్లు కొన్ని తప్పవంటూ వేదాంతం కూడా ఒలకబోశాడు. సో.. వీళ్లిద్దరి స్టేట్ మెంట్స్ చూస్తుంటే దాగుడుమూతలు దాదాపు లేనట్టే.

ఈ సినిమాకు సంబంధించి మరో ట్విస్ట్ ఏంటంటే.. ఇంద్రగంటి మోహనకృష్ణ రాకతోనే హరీష్ శంకర్ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా దిల్ రాజు కు ఓ మల్టీస్టారర్ స్టోరీ వినిపించాడు ఇంద్రగంటి. యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ చాలా బాగుందట. అందుకే హరీష్ శంకర్ ప్రాజెక్టు స్థానంలో ఇంద్రగంటి సినిమా ఎనౌన్స్ చేశాడు దిల్ రాజు.

అంతేకాదు, హరీష్ శంకర్ సినిమా కోసం అనుకున్న శర్వానంద్ కాల్షీట్లను ఇంద్రగంటి సినిమాకు ట్రాన్స్ ఫర్ చేశాడు. పనిలో పనిగా ఇంద్రగంటి రిఫరెన్స్ తో నాని కాల్షీట్లు మరోసారి పట్టాడు. అలా తనకు తెలియకుండానే హరీష్ శంకర్ కు ఎసరుపెట్టాడు ఇంద్రగంటి.