చినబాబును దెబ్బతీసిన పబ్లిసిటీ

సినిమాను సరైన రీతిలో ప్రెజెంట్ చేయడం ఎంత ముఖ్యమో, సరైన రీతిలో పబ్లిసిటీ చేయడం కూడా అంతే ముఖ్యం. తమిళ డబ్బింగ్ సినిమాలకు సమస్య ఏమిటంటే, పబ్లిసిటీ మెటీరియల్ తెలుగు నిర్మాత చేతిలో వుండదు.…

సినిమాను సరైన రీతిలో ప్రెజెంట్ చేయడం ఎంత ముఖ్యమో, సరైన రీతిలో పబ్లిసిటీ చేయడం కూడా అంతే ముఖ్యం. తమిళ డబ్బింగ్ సినిమాలకు సమస్య ఏమిటంటే, పబ్లిసిటీ మెటీరియల్ తెలుగు నిర్మాత చేతిలో వుండదు. వాళ్లు ఏది అందిస్తే, అదే వాడుకోవాలి. చినబాబు సినిమా ఇలాంటి వ్యవహారం వల్లనే దెబ్బతినట్లు కనిపిస్తోంది.   

చినబాబు సినిమా పక్కా ఫ్యామిలీ సినిమా. కానీ ఆది నుంచీ అదేదో రైతు సమస్యల సినిమా అన్నట్లు ప్రొజెక్టు చేసారు. ప్రచారానికి వచ్చిన హీరో కార్తీ మాటలు కూడా అన్నీ రైతు సమస్యల చుట్టూనే తిరిగాయి. దీనికి తోడు సినిమాకు తెలుగునాట ప్రచారం అంతంతమాత్రంగా సాగింది. 

దీంతో తొలిరోజు ఓపెనింగ్స్ మీడియం రేంజ్ లోనే వచ్చాయి. కానీ చూసిన వాళ్లంతా 'బాగుందనే' టాక్ నే వచ్చింది. కానీ శనివారం కూడా కలెక్షన్లు ఇంప్రూవ్ కాలేదు. అయితే స్టడీగానే వున్నాయి. అది ఒక విధంగా మంచిదే. ఆదివారం ఎలావుంటుందో చూడాలి. తెలుగు నిర్మాతలు శుక్రవారం రిజల్ట్ చూసిన వెంటనే పబ్లిసిటీ స్ట్రాటజీ మార్చి, ఫ్యామిలీ సినిమా అన్నది ప్రొజెక్టు చేసి వుంటే వేరుగా వుండేది. 

కానీ అలాంటి ప్రయత్నం కనిపించలేదు. వీకెండ్ సంగతి సరే, కనీసం మండే నుంచి అయినా స్టడీగా వుంటూ, పికప్ దిశగా వెళ్లాలంటే మాత్రం సినిమాను పక్కా ఫ్యామిలీ మూవీగా ప్రొజెక్ట్ చేస్తూ, కాస్త గట్టిగా పబ్లిసిటీ చేయడం అవసరం. లేదూ అంటే షేర్ పెద్దగా రావడం కష్టం. చిత్రమేమిటంటే, ఈ రైతు సమస్యల ప్రొజెక్షన్ వల్లనే కావచ్చు తమిళనాట కూడా అద్భుతమైన ఓపెనింగ్స్ ఏమీరాలేదు.