మళ్లీ మరో చంటబ్బాయ్?

పక్కా లోకల్ డిటెక్టివ్ కథతో బోలెడు ఫన్ పండించి, మెగాస్టార్ చిరంజీవికి మెమరబుల్ ప్రాజెక్టుగా మిగిల్చారు చంటబ్బాయ్ సినిమాను. మళ్లీ అలాంటి ప్రయత్నం ఏదో చేస్తున్నట్లుంది గతంలో మళ్లీరావా చిత్రాన్ని నిర్మించిన స్వధర్మ్ ఎంటర్…

పక్కా లోకల్ డిటెక్టివ్ కథతో బోలెడు ఫన్ పండించి, మెగాస్టార్ చిరంజీవికి మెమరబుల్ ప్రాజెక్టుగా మిగిల్చారు చంటబ్బాయ్ సినిమాను. మళ్లీ అలాంటి ప్రయత్నం ఏదో చేస్తున్నట్లుంది గతంలో మళ్లీరావా చిత్రాన్ని నిర్మించిన స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ హవుస్.

పాండ్..జేమ్స్ బాండ్ అన్నట్లుగా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఎఫ్ బి ఎ నెల్లూరు, పెళ్లిళ్ల ఎంక్వయిరీలు చేస్తామనడం, ఆషాఢం డిస్కౌంట్ సేల్ అని పేర్కొనడం, పైగా ఆఫీసును ఓ మెకానిక్ దుకాణంలాంటి చోట పెట్టడం అన్నీ చూస్తుంటే, కచ్చితంగా డిటెక్టివ్ జోనర్ లో ఫన్ సినిమా ఏదో ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్వరూప్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు.

సరైన స్టార్ కాస్ట్ లేకుండానే, మాంచి సబ్జెక్ట్ తో కొత్త డైరక్టర్ తో  మళ్లీ రావా అనే సినిమా తీసి సక్సెస్ కొట్టిన ప్రొడక్షన్ హవుస్ మళ్లీ మరో ప్రయత్నం చేస్తోందంటే కాస్త ఆసక్తికరమే.