వైఎస్ బయోపిక్ యాత్ర సినిమాలో ఎవరెవరో ఏవో పాత్రలు పోషించారు. సూరీడు, విజయమ్మ, హనుమంతరావు ఇలా చాలా పాత్రలు ఐడెంటిఫై చేసే విధంగా, ఎవరో చెప్పకుండానే జనం అర్థం చేసుకునేలా చేయగలిగారు. ఒక విధంగా అది కాస్త టాలెంట్ ప్రదర్శనే. పేరు పెట్టి పిలవకుండా, జనం వాళ్లను గుర్తించేలాంటి నటుల్ని తేగలగడం.
ఇదిలావుంటే యాత్ర సినిమాలో చిన్ననాటి వైఎస్ గా ఓ కుర్రాడు కనిపించాడు. కాస్త బొద్దుగా వున్న ఆ కుర్రాడు ఎవరు? అన్న దానిమీద ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. ఆ కుర్రాడు సినిమాలతోనో, సినిమా కుటుంబాలతోనో సంబంధం వున్న కుర్రాడు కాదట.
ఆ బాబు ఎవరో కాదు. వైఎస్ జగన్ కు సన్నిహితుడు అని, లేదా అనుచరుని కుమారుడని రకరకాల వార్తలు వినిపిస్తూ వచ్చిన సంగతి జనాలకు తెలిసిందే. ఆ వార్తలు ఇప్పుడు నిజం అయ్యాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఆ మంగలి కృష్ణ (దంతులూరి కృష్ణ) కుమారుడే యాత్ర బయోపిక్ లో వైఎస్ చిన్నప్పటి పాత్రలో కనిపించడం విశేషం.
అంటే ఆ విధంగా జగన్ కే కాదు, జగన్ సంబంధీకులు, సన్నిహితులకు కూడా యాత్ర సినిమాతో కనిపించని బంధం వుందన్నమాట.