Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

యాత్ర Vs కథానాయకుడు.. పెద్ద తేడా అదే!

యాత్ర Vs కథానాయకుడు.. పెద్ద తేడా అదే!

పేరుకి యాత్ర సినిమా వైఎస్సార్ బయోపిక్ అయినా, వైసీపీ నేతలు, కార్యకర్తలెవరూ విడుదల ముందు వరకూ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. పొలిటికల్ టచ్ లేకుండానే సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది. యాత్ర ఫంక్షన్లకి కూడా రాజకీయ నాయకులెవరూ హాజరుకాలేదు. జగన్ కూడా సినిమా గురించి ఎక్కడా వేదికలపై మాట్లాడలేదు.

అయితే రెండు రోజుల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. యాత్ర మూవీ తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు సినిమాకు విపరీతమైన ప్రచారం తెచ్చారు. దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లిపోయారు. కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో కోలాహలం ఎక్కువగా కనిపించింది.

ఎమ్మెల్యేలు, పార్టీ కీలకనేతలు తన అనుచరుల కోసం థియేటర్లలోని సీట్లన్నీ బుక్ చేయించారు. ఉదయం ఆటతోనే యాత్రకు వైఎస్సార్ అభిమానులు క్యూ కట్టారు. సినిమాకు పాజిటవ్ టాక్ రావడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేవు. యాత్ర థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపించింది.

వైసీపీ నేతలు సినిమాని ఓన్ చేసుకున్నా.. పార్టీలకతీతంగా ప్రజలు మొదటిరోజే సినిమాని చూడటానికి ఉత్సాహం చూపించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ కి, వైఎస్సార్ యాత్రకు తేడా తెలుసుకోవడం కోసం ఎక్కువమంది చూశారు. ఎన్టీఆర్-కథానాయకుడులో ఏది మిస్ అయిందో, యాత్ర సినిమాలో సరిగ్గా అదే హిట్ అయింది. అదే ఎమోషన్. భావోద్వేగాలు పెర్ ఫెక్ట్ గా పండడమే యాత్రకు ప్లస్ అయింది.

రెండు సినిమాల మధ్య ఇదే పెద్ద తేడా అంటున్నారు విశ్లేషకులు. ఎన్టీఆర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్ సినిమాకి మైనస్ కాగా, సినిమా విడుదల వరకు వైసీపీ నేతలు పాటించిన సంయమనం యాత్రపై పొలిటికల్ రిమార్క్ లేకుండా చేసి ప్లస్ అయింది.

రిలీజ్ దగ్గరపడినప్పుడు మాత్రమే నేతల సందడి కనిపించింది. విదేశాల్లో కూడా వైసీపీ అభిమానులు యాత్ర రిలీజ్ ను పండగలా జరుపుకున్నారు. మొత్తానికి యాత్ర సినిమా వైసీపీలో జోష్ పెంచగా, టీడీపీ నేతలు ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2 ఫలితం ఎలా ఉంటుందో అని అయోమయంలో పడ్డారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?