ఎనిమిదేళ్లకి పైగా పరాజయాలతో సావాసం చేసిన నితిన్ అనూహ్యంగా ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అటుపై 'అ ఆ'లాంటి బ్లాక్‌బస్టర్‌లో నటించిన నితిన్… తర్వాత రాంగ్ స్టెప్స్ వేసాడు. 'లై', 'ఛల్ మోహన్ రంగ', 'శ్రీనివాస కళ్యాణం'తో వచ్చిన డిజాస్టర్ హ్యాట్రిక్‌తో ఒత్తిడిలో పడిపోయాడు. మళ్లీ ఎక్కడ ఆ ఎనిమిదేళ్ల పరాజయాల ఫేజ్ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సి వస్తుందోనని ప్రస్తుతం తెగ టెన్షన్ పడుతున్నాడు.
ఛలో దర్శకుడు వెంకీ కుడుములతో 'భీష్మ' చేయడానికి అంగీకరించినా ఇంతవరకు అది మొదలు పెట్టలేదు. ఒకవైపు వెంకీ కథ సిద్ధం చేస్తూ వుండగానే నితిన్ వేరే సినిమాలు చేయడానికి ప్రయత్నించాడు. తమిళ హిట్ రాక్షసన్ హక్కుల కోసం తీవ్రంగా యత్నించాడు. ఇక తనకే రైట్స్ పక్కా అనుకునేంతలో అది తెలుగులో వర్కవుట్ అవుతుందా అనే అనుమానం కలిగి ఫైనల్‌గా దాన్నుంచి తప్పుకున్నాడు.
శ్రీనివాస కళ్యాణం రిలీజ్ అయి ఆరు నెలలు గడచిపోయినా నితిన్ కొత్త సినిమా మొదలు కాలేదు. ఈ మూడు పరాజయాల తర్వాత వచ్చే చిత్రం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నితిన్‌కి తెలుసు. అలా అని ఛలో తీసాడు కాబట్టి వెంకీ కుడుములని నమ్మలేడు. మొదటి సినిమాతో హిట్ ఇచ్చి తర్వాత ఫ్లాప్ అయిన దర్శకులు చాలామందే వున్నారు. మిడిల్ టేబుల్‌లో చాలా మంది స్టార్లు పుట్టుకురావడంతో నితిన్ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు.
'గెలవడం అసాధ్యం' అనే లెవల్ నుంచి వైఎస్‌ఆర్ ఎలా గెలిచారు
డబ్బుంటేనే గెలిచేస్తారా? ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే!