మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ సినిమా రంగ ప్రవేశం గురించి చాలా కాలంగానే వార్తలు వినవస్తున్నాయి. వాస్తవానికి మెగా అల్లుడిగా ఫొటో బయటకు వచ్చినపుడే, మెగా హీరోల టీమ్ కు మరొకరు అదనం అని అందరూ అనుకున్నారు. ఆ తరువాత మెల్లగా హీరోలకు కావాల్సిన సకల విధ్యలు నేర్చుకోవడం ప్రారంభం కావడంతో అది పక్కా అయింది.
అయితే ప్రాజెక్టు విషయంలో చాలా గుంభనంగా వుంటూ వచ్చారు. రాజమౌళి తరచు చిరు దగ్గరకు వెళ్లడం, ఆయన సన్నిహితుడు సాయి కొర్రపాటి దగ్గరకు మంచి కథ రావడం, ఆ విషయం చిరుకు చెప్పడం ఇవన్నీ తెరవెనుకే జరిగాయని వినికిడి. వన్ ఫైన్ మార్నింగ్ డైరక్టర్ ను చిరంజీవి దగ్గరకు పంపారు. ఆయన కథ మొత్తం విని, ఓకె చేసి, గో ఎహెడ్ అన్నాక, మిగిలిన పనులు ప్రారంభించారు.
హీరొయిన్ ఎవరు అన్నది ముందుగా స్టార్ట్ చేసారు. రామ్ చరణ్ పక్కన తీసుకున్నపుడు ఏ హీరోయిన్ ను అయితే చిరు ఫ్యామిలీ అంతా కలిసి, చిన్నపిల్లగా వుంది అని పక్కన పెట్టారో, ఆ అనుపమ పరమేశ్వరన్ ను ఫస్ట్ చాయిస్ గా ఇప్పుడు రికమెండ్ చేసారు. వెంటనే అనుపమ పర్సనల్ వర్గాలను కాంట్రాక్టు చేసారు. వీలవుతుందా? కథ వింటారా? డేట్లు వున్నాయా? అన్న దానికోసం.
దాంతో అదిగో, అక్కడ లీక్ అయిపోయింది విషయం. దాంతో మెగాస్టార్ చిరంజీవి కాస్త ఇబ్బందిగా పీలయినట్లు తెలుస్తోంది. అన్నీ ఫైనల్ అయిన తరువాత ఒకేసారి కాస్త గ్రాండ్ గా అనౌన్స్ చేద్దాం అనుకుంటే బయటకు వచ్చేసిందని ఆయన ఫీలయినట్లు తెలుస్తోంది.
గ్రాండ్ ఫంక్షన్
సినిమా ఓపెనింగ్ సెర్మనీ అయినా గ్రాండ్ గా వుండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి, రాఘవేంద్రరావు దగ్గర నుంచి ఇండస్ట్రీ పముఖలను పిలవాలని నిర్మాత సాయి కొర్రపాటి ఆలోచన. అయితే దీనికి ఇంకా చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వుంది. ఒకవేళ అనుపమ కనుక నో అంటే ఆల్టర్ నేటివ్ హీరోయిన్ కోసం కూడా చూస్తున్నారు. అప్పుడు ఓపెనింగ్ కాస్త ఆలస్యం కావచ్చు.