మళ్లీ రావా అనే చిన్న సినిమా విడుదలయింది ఈ వారం. ఈ సినిమా విడుదల కాకముందే ఆ సినిమాను డైరక్ట్ చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఓ అడ్వాన్స్ అందేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా అంటే చాలా కాలంగా సరైన హిట్ కొట్టక, మాంచిప్రాజెక్టు కోసం చూస్తున్న నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఈ కొత్త దర్శకుడికి అడ్వాన్స్ అందించనట్లు తెలుస్తోంది.
మళ్లీ రావా సినిమా చూసిన తరువాత ఆ టేకింగ్, అదీ కాస్త కాంటెపరరీగా వుండడంతో, ఇటీవల పెళ్లి చూపులు, మెంటల్ మదిలోలాంటి సినిమాలకు యూత్ నుంచి కాస్త రెస్పాన్స్ బాగుండడంతో, అలాంటి సినిమాలకు పనికివస్తాడనే ఆలోచనతో, అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మళ్లీ రావా సినిమాకు రెస్పాన్స్ ఎలా వుంటుందన్నది మూడు రోజులు అయితే తప్ప తెలియదు. అయితే విషయం వుంది కనుక, సరైన స్క్రిప్ట్ ను పట్టుకోగలిగితే, తన అనుభవం కలిపి ఓ మంచి సినిమా చేయవచ్చన్నది మధురశ్రీధర్ ఆలోచన కావచ్చు. అయినా ఇప్పుడు ఇండస్ట్రీలో సరైన దర్శకుల కొరత చాలా వుంది. కాస్త సబ్జెక్ట్ అల్లగల సత్తా వున్న దర్శకులు దొరికితే లటక్కున పట్టేసుకుంటున్నారు.