భలే బ్యాచ్ సెట్ అవుతోంది

చాన్నాళ్లయింది తమ్మారెడ్డి భరద్వాజ సినిమా తీసి. డైరక్షన్ లేదు. నిర్మాణం లేదు. ఇన్నాళ్లకు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఆ మధ్య నక్షత్రం అనే సినిమా చానాళ్లు చెక్కారు దర్శకుడు కృష్ణవంశీ. ఇప్పుడు…

చాన్నాళ్లయింది తమ్మారెడ్డి భరద్వాజ సినిమా తీసి. డైరక్షన్ లేదు. నిర్మాణం లేదు. ఇన్నాళ్లకు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. ఆ మధ్య నక్షత్రం అనే సినిమా చానాళ్లు చెక్కారు దర్శకుడు కృష్ణవంశీ. ఇప్పుడు ఆయన నిర్మాతగా, ఈయన దర్శకుడిగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంద.

అయితే ఇందులో రెండు కీలకపాత్రలు వుంటాయని, ఒక పాత్రకు తమిళ హీరో మాధవన్ ను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రెండో పాత్రకు రానాను అయితే ఎలా వుంటుందని డిస్కషన్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. మాధవన్, రానా జోడీ అయితే కచ్చితంగా తెలుగు, తమిళ భాషల మార్కెట్ వుంటుంది.

అయితే రానా ఓకె అనాలి. అంతకు ముందు కథ విని సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అదంతా చిన్న ప్రాసెస్ కాదు. లేదూ, రానా కాకుండా మరెవరైనా అంటే ప్రస్తుతానికి ఎవ్వరూ ఖాళీ లేరు. కృష్ణవంశీ అనగానే కాస్త ఆలోచించే అవకాశం కూడా ఎక్కువే వుంది.