Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చిరు జపం చేస్తోన్న 'మా' ?

చిరు జపం చేస్తోన్న 'మా' ?

మా.. తెలుగు సినిమా నటీనటుల అసోసియేషన్. రెండేళ్ల క్రితం తొలిసారి ఈ అసోసియేషన్ లో లుకలుకలు బయటకు వచ్చాయి. మురళీమోహన్ నాయకత్వంలోని కార్యవర్గంపై తిరుగుబాటు జరిగింది. జయసుధ ప్యానల్ ను ఓడించి రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ గెలిచింది. కొన్నాళ్ల పాటు రాజేంద్ర ప్రసాద్ హవా కనిపించింది.

రాజేంద్ర ప్రసాద్ ఆ పదవి ఇచ్చిన హుషారుతో బడా బడా రాజకీయ ప్రముఖులను అందర్నీ కలిసి హల్ చల్ చేసారు. ఆ తరువాత మళ్లీ మా లోని రెండు వర్గాలు ఒకటైపోయినట్లే. శివాజీ రాజా అందరినీ ఆకట్టుకుని, ఏకగ్రీవంగా అధ్యక్షుడు అయ్యారు. వాస్తవానికి సీనియర్ నరేష్ కు అధ్యక్షుడు కావాలని వున్నా, జనరల్ సెక్రటరీతో సరిపెట్టుకున్నారని వార్తలు వున్నాయి.

అంతా బాగానే వుంది అనుకుంటే, ఇప్పుడు మళ్లీ మా లో లుకలుకలు మెల్లగా ప్రారంభం అవుతున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే, మా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేయాలని తలపెట్టారు. అక్కడే సణుగుళ్లు మొదలయినట్లు తెలుస్తోంది. శివాజీ రాజా ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ప్లానింగ్ అంతా మెగాస్టార్ చిరంజీవి ఆదేశాల మేరకే జరుగుతోందని, ఆయనను తప్ప, వేరే వారిని పెద్దగా సంప్రదించడం లేదని కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్నింటికి మెగాస్టార్ నే సంప్రదించడం సంగతి అలా వుంచితే, ఈ మధ్య సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ల ప్లానింగ్ కారణంగా పార్టీలు ఎక్కువగా అవుతున్నాయని, వీకెండ్ పార్టీల పేరిట డబ్బులు బాగా ఖర్చుచేస్తున్నారని, అయితే ఇది మా అసోసియేషన్ మనీనా, నిర్వాహకుల మనీనా అన్నది తెలియడం లేదని, కొందరు సభ్యులు అంటున్నారు. ఇన్నాళ్లు కూడబెట్టిన మా అసోసియేషన్ మనీని సిల్వర్ జూబ్లి ఉత్సవాల ప్లానింగ్ పేరిట ఖర్చుచేసేస్తున్నారని అంటున్నారు. మరి నిజానిజాలు సభ్యులకే తెలియాలి.

అయితే ఎవరు ప్రస్తుతానికి లోలోపల లేదా, ఒకరి దగ్గర మరొకరు మాట్లాడుకోవడం, వాపోవడం తప్ప, ఇంకా బాహాటంగా బయటకు మాట్లాడడం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చినపుడే ఇవన్నీ బయటకు వస్తాయని అంటున్నారు. సీనియర్ నరేష్ కు కూడా మా వ్యవహారాలపై అభ్యంతరాలు వున్నాయని, అయితే ప్రస్తుతానికి బయటపడితే బాగుండదని సైలెంట్ గా వున్నారని మా లోని కొందరు సభ్యులు అంటున్నారు.

మొత్తానికి బయటకు రాకుండానే మా లో ఏదో జరుగుతోందని మాత్రం ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?