Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'నా పేరు సూర్య' నైజాం రైట్స్@21.5 కోట్లు

'నా పేరు సూర్య' నైజాం రైట్స్@21.5 కోట్లు

బన్నీ-వక్కంతం వంశీ కాంబినేషన్ లో లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్ నిర్మిస్తున్న నా పేరు సూర్య నైజాం బిజినెస్ క్లోజ్ అయింది. మంచి రేట్ వచ్చిందనే చెప్పాలి. ఇప్పటికి బన్నీ హయ్యస్ట్ రికార్డు నైజాంలో 20 నుంచి 21కోట్ల వరకు వుంది. ఇప్పుడు నా పేరు సూర్యకు 21.5 కోట్లు పలికింది. 

క్యాంటీన్ ప్రసాద్ ఈ సినిమాను తీసుకుని, ఏసియన్ సునీల్ ద్వారా పంపిణీ చేస్తున్నారు. అయితే ఇంకో పాయింట్ ఏమిటంటే, సినిమా షేర్ కనుక 25కోట్లు దాటితే మరో 1.5కోట్లు నిర్మాతకు బయ్యర్ ఇవ్వాల్సి వుంటుంది. అదో అదనపు షరతు అన్నమాట.

నాపేరు సూర్య సినిమాకు సుమారు 70కోట్లకు పైగా బడ్జెట్ అవుతోంది. బిజినెస్ కూడా డిజిటల్ రైట్స్, థియేటర్ రైట్స్ అన్నీకలిపి 100కోట్లను దాటుతోంది. ఈ సినిమాకు ఇప్పటికి అయితే ఏప్రేల్ 26ను రిలీజ్ డేట్ గా ప్రకటించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?